News December 8, 2025
పెద్దపల్లి: పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం అందించాలి: కలెక్టర్

పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సోమవారం పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రిటర్నింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. డిసెంబర్ 9, 12న రెండో, మూడో విడత ఎన్నికల సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించాలని, ఎంపీడీవో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారులు అందుబాటులో ఉండాలని అన్నారు. పోలింగ్ సామగ్రి సరఫరా, కేంద్రాల పరిశీలన, కౌంటింగ్, ఉపసర్పంచ్ ప్రక్రియలో పూర్తి జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
Similar News
News December 8, 2025
NGKL: ఎన్నికల విధులకు డుమ్మా.. షోకాజ్ నోటీసులు

గద్వాల జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల శిక్షణకు హాజరుకాని 206 మంది పోలింగ్ సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు కలెక్టర్ బాదావత్ సంతోష్ సోమవారం తెలిపారు. వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులు శిక్షణకు హాజరు కాకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తర్వులను అతిక్రమించినందుకు వారిపై క్రమశిక్షణా చర్యలు తప్పవని, 24 గంటలలో సమాధానం ఇవ్వాలని ఆదేశించారు.
News December 8, 2025
GHMCలో వార్డుల సంఖ్య రెట్టింపు

TG: GHMCలో వార్డుల సంఖ్యను 150 నుంచి 300కు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. గ్రేటర్ హైదరాబాద్‌లో 7 కార్పొరేషన్లు, 20 మున్సిపాలిటీలను ఇటీవల విలీనం చేసిన విషయం తెలిసిందే. దీంతో వార్డుల సంఖ్య డబుల్ అయ్యింది. ఈ విస్తరణతో 2,735 చదరపు కి.మీతో దేశంలోనే అతిపెద్ద నగరంగా హైదరాబాద్ అవతరించనుంది.
News December 8, 2025
NGKL: ఎన్నికల భద్రతా ఏర్పాట్లపై డీఐజీ సమీక్ష

నాగర్‌కర్నూల్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల భద్రతా చర్యలను జోగులాంబ జోన్ డీఐజీ ఎల్.ఎస్. చౌహాన్ సమీక్షించారు. ఎస్పీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పోలింగ్ రోజున ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సోషల్ మీడియా అపోహలపై కఠిన చర్యలు, సమస్యాత్మక బూత్‌లపై ప్రత్యేక నిఘా కొనసాగించాలని సూచించారు. ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ పాల్గొన్నారు.


