News July 8, 2025
పెద్దపల్లి ప్రజలు ప్రభుత్వ వైద్య సేవలు వినియోగించుకోవాలి: కలెక్టర్

పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తున్న వైద్య బృందాన్ని కలెక్టర్ అభినందించారు. ప్రైవేట్ ఆస్పత్రిలో మెడ నొప్పికి చికిత్స పొందినా తగ్గలేదని ఓ మహిళ, కడుపు నొప్పితో బాధపడుతూ మరో మహిళ PDPL ఆస్పత్రిలో చేరారు. డాక్టర్లు శ్రీధర్, స్రవంతి, సౌరయ్య తదితరులు వైద్య పరీక్షలు నిర్వహించి మంగళవారం ఇద్దరికి విజయవంతంగా సర్జరీ పూర్తి చేశారు. జిల్లా ప్రజలు DCH/PHCలను వినియోగించుకోవాలన్నారు.
Similar News
News July 9, 2025
అమర్‌నాథ్ యాత్రకు 6 రోజుల్లోనే లక్షమంది

ఈనెల 3న ప్రారంభమైన అమర్‌నాథ్ యాత్రకు భక్తులు పెద్దఎత్తున తరలివెళ్తున్నారు. మొదటి 6 రోజుల్లోనే దాదాపు లక్షమంది భక్తులు మంచు శివలింగాన్ని దర్శించుకున్నట్లు J&K LG మనోజ్ సిన్హా ట్వీట్ చేశారు. గతేడాది 52 రోజులపాటు సాగిన అమర్‌నాథ్ యాత్ర ఈసారి మాత్రం 38 రోజులు మాత్రమే కొనసాగనుంది. రెండు మార్గాల్లోనూ యాత్ర సజావుగా సాగుతోంది. ఈసారి మొత్తం 5 లక్షల వరకు భక్తులు యాత్రలో పాల్గొంటారని ఆలయ బోర్డు భావిస్తోంది.
News July 9, 2025
నిరుద్యోగ యువతీయువకులకు సువర్ణవకాశం

శంకరపట్నం మండలం ఎంపీడీవో కార్యాలయంలో దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన పథకానికి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ పథకం ద్వారా గ్రామీణ పేద నిరుద్యోగ యువతీయువకులకు నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా వారి సౌజన్యంతో శిక్షణ అందించి ఉద్యోగం కల్పించనున్నారు. అభ్యర్థులు విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు, రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్‌తో ఈ నెల 10న కార్యాలయంలో సంప్రదించాలని ఎంపీడీవో కృష్ణ ప్రసాద్ తెలియజేశారు.
News July 9, 2025
బ్రెజిల్ అధ్యక్షుడు, ప్రజలకు కృతజ్ఞతలు: మోదీ

బ్రెజిల్ నుంచి అత్యున్నత పురస్కారం అందుకోవడం గౌరవంగా భావిస్తానని ప్రధాని మోదీ తెలిపారు. ‘ది గ్రాండ్ కాలర్ ఆఫ్ ది నేషనల్ ఆర్డర్ ఆఫ్ ది సదరన్ క్రాస్’ అవార్డు అందుకోవడంపై అధ్యక్షుడు లూలా, బ్రెజిల్ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఇది భారతదేశ ప్రజల పట్ల బ్రెజిల్ ప్రజలకు ఉన్న బలమైన అభిమానాన్ని వివరిస్తుంది అన్నారు. రాబోయేకాలంలో ఇరు దేశాల స్నేహం మరిన్ని విజయ శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.