News November 24, 2025
పెద్దపల్లి: ప్రజావాణిలో ఆర్జీలు స్వీకరించిన అదనపు కలెక్టర్

పెద్దపల్లి కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డి. వేణు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అర్జీదారుల సమస్యలను ఓపికగా విన్న ఆయన, వాటిని సత్వరమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ దరఖాస్తులు సమర్పించారు.
Similar News
News November 25, 2025
నేడు హనుమకొండలో బీజేపీ రైతు దీక్ష

రైతుపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ హనుమకొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు కొలను సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం 10 గంటలకు ఏకశిల పార్క్‌లో మహా రైతు దీక్ష చేపట్టానున్నారు. ఈ కార్యక్రమనికి ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బస్వ లక్ష్మీనారాయణ పాల్గొననున్నారు.
News November 25, 2025
జగన్నాథపురంలో శాటిలైట్ రైల్వే స్టేషన్?

విశాఖ రైల్వే స్టేషన్ మీద ట్రాఫిక్ భారం తగ్గించేందుకు రైల్వే శాఖ సబ్బవరం సమీపంలోని జగన్నాథపురం వద్ద కొత్త శాటిలైట్ స్టేషన్‌ను ప్రతిపాదించినట్లు సమాచారం. కొత్తవలస–అనకాపల్లి మధ్య 35 కిమీ బైపాస్ లైన్ ప్రాజెక్టులో భాగంగా.. 563 హెక్టార్లు విస్తీర్ణంలో రూ.2,886.74 కోట్లతో నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఈ స్టేషన్‌లో 15 ఫ్రైట్ ఎగ్జామినేషన్ లైన్లు, 5 కోచింగ్, 11 స్టాబ్లింగ్ లైన్లు ఉండనున్నట్లు సమాచారం.
News November 25, 2025
నంద్యాల: అంగన్వాడీ ఆయా ఉద్యోగం ఇప్పిస్తానని మోసం

నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్‌కు ప్రజా సమస్యలు వెల్లువెత్తాయి. అంగన్వాడీ ఆయా ఉద్యోగం ఇప్పిస్తానని ఇమాన్యుల్ అనే వ్యక్తి రూ.2.50 లక్షలు తీసుకొని మోసం చేశాడని కాశమ్మ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుల్లో ఎక్కువగా సివిల్ కేసులు ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. చట్టపరిధిలో పరిష్కారం అయ్యే కేసులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన పరిష్కార వేదికకు 82 ఫిర్యాదులు అందినట్లు తెలిపారు.


