News March 5, 2026

పెద్దపల్లి: ప్రతి పౌరుడికి ఆధార్ అందేలా చర్యలు: కలెక్టర్

image

జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో గురువారం ఆధార్ అప్‌డేట్ సమీక్ష నిర్వహించారు. ప్రతి పౌరుడికి ఆధార్ కార్డు అందేలా చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు ఆధార్ తప్పనిసరి అని కలెక్టర్ తెలిపారు. ఇప్పటికే ఉన్న ఆధార్ కార్డులు సమయానికి అప్‌డేట్ చేయాలని, ప్రత్యేక డ్రైవ్‌ల ద్వారా పాఠశాలల్లో విద్యార్థులకు ఆధార్ అందించడానికి పర్యటనలు నిర్వహించాలని సూచించారు.

Similar News

News March 6, 2026

MBNR: ప్రజాపాలన -ప్రగతి ప్రణాళిక విజయవంతం చేయాలి

image

ప్రజా పాలని -ప్రగతి ప్రణాళిక విజయవంతం చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజానర్సింహా పిలుపునిిచ్చారు. శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఐడీఓసీలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మార్చి 6 తారీకు నుంచి జూన్ 12 వరకు ఈ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. 99 రోజులపాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే తదితరులు పాల్గొన్నారు.

News March 6, 2026

వైభవోపేతంగా స్వామివారి కుంభాభిషేక మహోత్సవాలు

image

విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి కుంభాభిషేక మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. రెండవ రోజు యాగశాలలో అష్టోత్తర కలశస్థాపన, మూలమంత్ర హవనాలు నిర్వహించనున్నారు. ఆదివారం ఉదయం 9:34కు మేషలగ్నంలో కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి చేతుల మీదుగా కనకదుర్గ అమ్మవారి గోపురానికి కుంభాభిషేకం జరగనుంది.

News March 6, 2026

ప్రజలకు జగన్ నరకం చూపిస్తున్నారు: CBN

image

AP: పరామర్శల పేరుతో జగన్ ప్రజలకు నరకం చూపిస్తున్నారని అసెంబ్లీ వేదికగా సీఎం చంద్రబాబు విమర్శించారు. ‘గంజాయి బ్యాచ్ పరామర్శలకు వెళ్లడం సిగ్గుచేటు. వైసీపీ డ్రామాలతో అంబులెన్స్‌లు కూడా చిక్కుకుపోతున్నాయి. వాళ్ల వాహనాల టైర్లు మనుషులను తొక్కేస్తున్నాయి. మళ్లీ ఆ నిందను ప్రభుత్వంపైనే వేసే ప్రయత్నం చేస్తున్నారు. పోస్టుమార్టమ్‌కు కారణమైన వాళ్లు పోస్టుమార్టమ్‌కే వెళతారు’ అని సెటైర్ వేశారు.