News January 8, 2026

పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో లాప్రోస్కోపిక్ శస్త్రచికిత్స విజయవంతం

image

PDPL ప్రభుత్వ ఆసుపత్రిలో 46 ఏళ్ల మహిళ గాల్ బ్లాడర్‌లో 14mm స్టోన్‌తో బాధపడుతుండగా లాప్రోస్కోపిక్ కొలాసిస్టెక్టమీ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. లాప్రోస్కోప్ సర్జన్ డా.అమరసింహా రెడ్డి నేతృత్వంలో వైద్యబృందం ఈ ఆపరేషన్ చేపట్టింది. పాల్గొన్న వైద్యులను ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.శ్రీధర్ అభినందించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఆధునిక చికిత్సలు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు వినియోగించుకోవాలని తెలిపారు

Similar News

News February 16, 2026

ప్రకాశం: నేడే లాస్ట్.. అప్లై చేశారా?

image

ప్రకాశం డివిజన్ పరిధిలోని అన్నబోయినపల్లి, చాగళ్లు, దూబగుంట, జె.పంగలూరు, కందలూరు, మర్లపాడు, ఎం. నిడమనూరుతో పాటు 52 చోట్ల BPM, ABPM పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. రూ.12 వేల నుంచి రూ.24,470 జీతం లభిస్తుంది. పదో తరగతి పాసైతే చాలు. దరఖాస్తుకు ఇవాళే చివరి తేదీ. 52 పోస్టుల ఖాళీల వివరాల కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News February 16, 2026

మాజీ ఎంపీ కన్నుమూత

image

AP: రాజ్యసభ మాజీ MP తడపట్ల రత్నాబాయి(79) కన్నుమూశారు. ఆదివారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో పోలవరం(D) రంపచోడవరం ఏరియా ఆస్పత్రికి తరలించగా అక్కడ ఆమె చనిపోయారు. రత్నాబాయి 1972లో ఎల్లవరం(ప్రస్తుతం ర.చోడవరం) నుంచి కాంగ్రెస్ MLAగా గెలిచారు. 2008లో MPగా, 2014-20 వరకు MLCగా సేవలందించారు. అటు BC ఉద్యమ నేత, మాజీ MLC ఐలాపురం వెంకయ్య(93) అనారోగ్య సమస్యలతో నిన్న విజయవాడలో తుదిశ్వాస విడిచారు.

News February 16, 2026

నేడు ప్రజావాణి రద్దు: సంగారెడ్డి కలెక్టర్

image

మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా సోమవారం ఛైర్మన్, వైస్‌ఛైర్మన్ ఎంపిక కార్యక్రమంలో అధికారులు పాల్గొననున్న సందర్భంగా ప్రజావాణి నిలిపివేయనున్నట్లు చెప్పారు. ఈ విషయాన్ని గమనించి ప్రజలు ఎవరూ తమ సమస్యలపై కలెక్టరేటుకు రావొద్దని కోరారు.