News August 26, 2025

పెద్దపల్లి: ప్రభుత్వ బీసీ బాలికల వసతి గృహంలో ఆకస్మిక తనిఖీ

image

పెద్దపల్లి మండలం పెద్దకల్వలలో ప్రభుత్వ బీసీ బాలికల వసతి గృహంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి కుంచాల సునీత శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతి గృహంలోని విద్యార్థులు, స్టాఫ్‌ వివరాలను అడిగి తెలుసుకున్నారు. హాస్టల్‌లోని అన్ని వసతులను పరిశీలించారు. వసతి గృహం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కామన్‌ డైట్‌ మెనూ పకడ్బందీగా అమలు చేయాలన్నారు.

Similar News

News August 27, 2025

4 టైటిల్స్.. అశ్విన్ IPL ప్రస్థానమిదే

image

IPLకు స్టార్ ప్లేయర్ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. 2009లో CSK తరఫున ఎంట్రీ ఇచ్చి 2010, 2011లో ఆ జట్టు IPL టైటిల్స్ గెలవడంలో కీలక పాత్ర పోషించారు. CSK తరఫునే 2010, 2014లో ఛాంపియన్స్ లీగ్ ట్రోఫీస్ గెలిచారు. చెన్నై, RPS, పంజాబ్, DC, RR ఫ్రాంచైజీల్లో ఆడిన అశ్విన్ ఓవరాల్‌గా 221 మ్యాచ్‌ల్లో 187 వికెట్లు తీశారు. చెన్నైతోనే మొదలైన IPL ప్రయాణం ఈ ఏడాది అదే జట్టుతో ముగిసింది. <<17531363>>FAREWELL ASH<<>>

News August 27, 2025

జిల్లా నుంచి పారా జాతీయ స్థాయి పోటీలకు పయనం

image

పారా రాష్ట్ర స్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరచడంతో ఉమ్మడి విజయనగరం జిల్లా నుంచి 13 మంది ఎంపికయ్యారు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ వేదికగా ఈనెల 29 నుంచి 31 వరకు జాతీయ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ -2025 జరగనుంది. ఈ పోటీలకు జిల్లాకు చెందిన క్రీడాకారులు బుధవారం బయలుదేరారు. వీరందరికి పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షులుదయానంద్ అభినందనలు తెలిపారు.

News August 27, 2025

ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి: నిర్మల్ ఎస్పీ

image

వినాయక నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా, సంతోషంగా జరుపుకోవాలని నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల సూచించారు. భైంసాలోని క్యాంపు కార్యాలయంలో ఆమె హిందూ ఉత్సవ శాంతి కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. విగ్రహాల నిమజ్జనం వరకు ఉత్సవాలను శాస్త్రోక్తంగా, సంప్రదాయబద్ధంగా నిర్వహించుకోవాలని కోరారు. ఈ సమావేశంలో భైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.