News March 6, 2025
పెద్దపల్లి: ప్రశాంతంగా రెండో రోజు పరీక్షలు

పెద్దపల్లి జిల్లాలో ఇంటర్ రెండవ సంవత్సరం మొదటి పరీక్ష గురువారం ప్రశాంతంగా జరిగిందని ఇంటర్మీడియట్ జిల్లా అధికారి కల్పన తెలిపారు. తెలుగు, హిందీ, ఉర్దూ భాష పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షకు (4900) మంది హాజరు కావాల్సి ఉండగా, (4796)మంది హాజరు కాగా,(104) మంది విద్యార్థులు గైర్హాజరు అయ్యారన్నారు. 97.87% హాజరు నమోదు కావడం జరిగిందన్నారు.
Similar News
News July 4, 2025
వరంగల్ పోక్సో కోర్టు పీపీగా వెంకటరమణ

వరంగల్ జిల్లా పోక్సో కోర్టు నూతన పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా గంప వెంకటరమణ నియామకమయ్యారు. ఈ మేరకు రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఉత్తర్వులు జారీ చేయగా ఆయన బాధ్యతలు చేపట్టారు. 2007లో లా పట్టా పొంది, జిల్లా న్యాయస్థానాల్లో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్న రమణకు ఈ అవకాశం వచ్చింది. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
News July 4, 2025
పాలమూరు: కొత్త రేషన్ కార్డ్.. ఇలా చేయండి!

ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొత్త రేషన్ కార్డుల మంజూరు, పేర్లు చేర్చడంపై అధికారులు ప్రత్యేక ఫోకస్ పెట్టారు. మీ సేవలో దరఖాస్తు చేసుకున్న అనంతరం రెవెన్యూ అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో సర్వే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా వివాహమైన వారు రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేయాలంటే మొదట సంబంధిత తహశీల్దార్ కార్యాలయాలకు వెళ్లి తల్లిదండ్రుల కార్డుల నుంచి పేర్లను తొలగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
News July 4, 2025
ఇసుక అక్రమ తవ్వకాలను పూర్తిగా అరికట్టాలి: కలెక్టర్

అక్రమ ఇసుక తవ్వకాలు పూర్తిగా అరికట్టాలని కమిటీ సభ్యులకు కలెక్టర్ మహేశ్ కుమార్ సూచించారు. అమలాపురంలోని కలెక్టరేట్‌లో శుక్రవారం జిల్లా స్థాయి ఇసుక కమిటీ సభ్యులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ప్రస్తుత వర్షాకాలంలో స్టాక్ యార్డుల ద్వారా ఇసుక విక్రయాలు నిర్వహణ కోసం పటిష్టమైన ఏర్పాట్లను చేపట్టాలని ఆదేశించారు.