News February 3, 2025
పెద్దపల్లి బీజేపీ అధ్యక్షుడిగా సంజీవరెడ్డి
ఓదెల మండలం కొలనూర్కి చెందిన సంజీవ రెడ్డి బీజేపీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడిగా నియమితులయ్యారు. బీజేపీ తెలంగాణ సంఘటన పర్వ్- 2024 ఎన్నికల నియమావళి ఆధారంగా బీజేపీ రాష్ట్ర ఎన్నికల అధికారి క్ష్మీ నారాయణ సంజీవను అధ్యక్షులుగా నియమించారు. ఈ సందర్భంగా బీజేపీ పెద్దపల్లి జిల్లా ఎన్నికల అధికారి శ్రీకాంత్ నియామక పత్రాన్ని విడుదల చేశారు. తన నియామకానికి సహకరించిన వారికి అయన కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News February 3, 2025
టెన్త్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించాలి: కలెక్టర్
జిల్లాలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో ఉండి చదువుకుంటున్న పదో తరగతి విద్యార్థులు వచ్చే నెలలో నిర్వహించే పబ్లిక్ పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జి. లక్ష్మిశ పేర్కొన్నారు. విజయవాడలో సోమవారం నిర్వహించిన సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్ వార్డెన్ల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. గతేడాది 95.2% ఉత్తీర్ణత నమోదయిందని, ఈ ఏడాది 100శాతం నమోదు కావాలన్నారు.
News February 3, 2025
పోలీసుల ముందే కార్పొరేటర్లను కిడ్నాప్ చేశారు: రోజా
AP: కూటమి నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారని వైసీపీ మాజీ ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. ‘కూటమి నేతల అరాచకాల్ని ఖండిస్తున్నాం. తిరుపతిలో మేయర్ ఎన్నిక సందర్భంగా పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. పోలీసుల ముందే కార్పొరేటర్లను కిడ్నాప్ చేశారు. మీరు నిజంగా ప్రజా మద్దతుతో గెలిచి ఉంటే ఇలా చేయాల్సిన అవసరం ఉందా? ఈ ప్రభుత్వ అరాచకాలపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి’ అని హెచ్చరించారు.
News February 3, 2025
జగిత్యాల జిల్లాలో పోలీస్ యాక్ట్ అమలు
జగిత్యాల జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని నెల రోజుల ( ఫిబ్రవరి 1వ తేది నుంచి 28 వరకు) పాటు జిల్లా వ్యాప్తంగా పోలీసు యాక్ట్ అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. పోలీసు అధికారుల అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, రాస్తా రోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్లు, సభలు నిర్వహించరాదని ఆయన అన్నారు.