News November 26, 2025

పెద్దపల్లి: ‘బీసీ ఉద్యమాలలో మహిళలు భాగస్వామ్యం కావాలి’

image

పెద్దపల్లి ఆర్యవైశ్య భవనంలో నిర్వహించిన సెమినార్లో ‘బీసీ ఉద్యమాల్లో మహిళల పాత్ర’ అంశంపై చర్చ జరిగింది. బీసీ హక్కుల సాధనలో మహిళల భాగస్వామ్యం తప్పనిసరని నాయకులు అభిప్రాయపడ్డారు. బీసీలకు హామీ ఇచ్చిన 42% రిజర్వేషన్‌ను 22%కు తగ్గించడం అన్యాయమని, కామారెడ్డి డిక్లరేషన్ అమలయ్యే వరకు పోరాటాలు కొనసాగుతాయని ఉద్యమకారుడు శ్రీమన్నారాయణ స్పష్టం చేశారు.

Similar News

News November 27, 2025

ఆ బంగ్లాను రబ్రీదేవి ఖాళీ చేయరు: RJD

image

RJD చీఫ్ లాలూ భార్య రబ్రీదేవి ఉంటున్న నివాసాన్ని ఆమె ఖాళీ చేయరని, ఏం చేసుకుంటారో చేసుకోండని ఆ పార్టీ బిహార్ చీఫ్ మంగానీ లాల్ మండల్ తెలిపారు. జీవితకాల నివాసం కింద ఆ బంగ్లాను కేటాయించినట్లు చెప్పారు. పట్నాలోని అన్నే మార్గ్‌లో CM నివాసం ఎదుట రబ్రీదేవి, లాలూ 2 దశాబ్దాలుగా ఉంటున్నారు. కాగా దాన్ని ఖాళీ చేసి హార్డింజ్ రోడ్ 39 బంగ్లాకు మారాలంటూ ఇటీవల నితీశ్ ప్రభుత్వం ఉత్తర్వులివ్వగా RJD స్పందించింది.

News November 27, 2025

జగిత్యాల: లేబర్ కోడ్స్ రద్దు చేయాలని కలెక్టర్‌కు వినతి

image

కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన 4 లేబర్ కోడ్స్‌ను రద్దుచేయాలని కేంద్ర కార్మిక సంఘాల ఐక్యవేదిక జిల్లా జేఏసీ నాయకులు బుధవారం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. వేతనాలు, ఉద్యోగ భద్రత, సంక్షేమం, పని పరిస్థితుల పేరుతో ఆమోదించిన ఈ కోడ్స్ వల్ల కార్మికుల కుటుంబాలకు జీవనప్రమాణాలు దెబ్బతింటాయని వారు ఆందోళన వ్యక్తంచేశారు. కార్మికులకు అనుకూలమైన 44 కార్మికచట్టాలను అమలుచేయాలని కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలను వారు కోరారు.

News November 27, 2025

జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

image

> జనగామ: పత్తి అమ్మకంలో రైతుల ఇక్కట్లు
> బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా కలెక్టరేట్ వద్ద నిరసన
> ఎన్నికల నిబంధనలపై అందరికీ ఆవాహన ఉండాలి
> జనగామ: బీఆర్ఎస్ సమావేశానికి కేటీఆర్ హాజరు
> స్టేషన్ ఘనపూర్‌లో తొలగించని ఫ్లెక్సీలు
> నర్మెట్ట: కొమురవెల్లి దేవస్థానం ఛైర్మన్‌గా గంగం నరసింహ రెడ్డి
> పంచాయతీ ఎన్నికలకు పకడ్బంది ఏర్పాట్లు చేయాలి: ఎన్నికల కమిషనర్