News April 1, 2024
పెద్దపల్లి: బైక్ చెట్టుకు ఢీకొని వ్యక్తి మృతి

సుల్తానాబాద్ మండలం సుద్దాల సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. ఎస్ఐ శ్రావణ్ కుమార్ తెలిపిన ప్రకారం… ఓదెల మండలానికి శ్రీనివాస్(46) ఓ వివాహ వేడుకల్లో పాల్గొని తిరిగి ఓదెలకు వెళ్తున్న క్రమంలో సుద్దాల సమీపంలో బైక్ అదుపుతప్పి చెట్టుకి ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Similar News
News April 22, 2025
గుంపుల- తనుగుల వంతెన పై రోడ్డు ప్రమాదం యువకుడు మృతి

ఓదెల(M) గుంపుల, జమ్మికుంట(M) తనుగుల మధ్య ఉన్న వంతెనపై రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. JMKT(M) వావిలాలకు చెందిన నెల్లి వంశీ(25)కి ఓదెల(M) గూడెంకు చెందిన అర్చితతో ఇటీవల వివాహమైంది. కళ్యాణ లక్ష్మి పత్రాలపై సంతకం చేసేందుకు ఉదయం గూడెం గ్రామానికి వచ్చారు. తిరుగు ప్రయాణంలో గుంపుల వంతెన పై ఎదురుగా వస్తున్న కారు బైక్ ను ఢీ కొట్టింది. వంశీ మృతి చెందగా అర్చిత ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది.
News April 21, 2025
కరీంనగర్: ధరణిలో పొరపాట్ల సవరణ అధికారం కలెక్టర్‌కే : పమేలా సత్పతి

ధరణిలో పొరపాట్లను సవరించడానికి కలెక్టర్ మినహా ఏ అధికారికి అవకాశం లేదని కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. సోమవారం గంగాధరలోని ఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో భూభారతి, ఆర్వోఆర్ చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తహశీల్దార్ స్థాయిలో పరిష్కారమయ్యే చిన్న సమస్యలు వేలసంఖ్యలో పేరుకుపోయాయన్నారు. భూభారతి చట్టం ద్వారా ప్రభుత్వం అన్ని సమస్యలు పరిష్కరిస్తుందన్నారు.
News April 21, 2025
కరీంనగర్: అణగారిన వర్గాల అభ్యున్నతికి అంబేడ్కర్ కృషి: బండి

భారతదేశ చరిత్రలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ ఎదుర్కొన్న అవమానాలు మరెవరూ ఎదుర్కోలేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కరీంనగర్ లో అన్నారు. ఎన్ని అవమానాలు ఎదురైనా, అడుగడుగునా హేళనకు గురైన వాటినే సోపానాలుగా చేసుకుంటూ అనుకున్న లక్ష్యానికి చేరుకోవడంతోపాటు తన చదువునంతా సమాజ శ్రేయస్సుకు, అణగారిన వర్గాల అభ్యున్నతికి ధారపోసిన మహనీయుడు అంబేడ్కర్ అని కొనియాడారు.