News November 6, 2025

పెద్దపల్లి: భవన నిర్మాణ కార్మికులకు మరణ సహాయం పెంపు: హేమలత

image

భవన నిర్మాణ రంగ కార్మికులకు మరణ ఉపశమన సహాయం పెంచినట్లు పెద్దపల్లి సహాయ కార్మిక అధికారిణి హేమలత తెలిపారు. ప్రమాద మరణ సహాయం రూ.10లక్షలకు, సాధారణ మరణ సహాయం రూ.2 లక్షలకు పెంచినట్లు తెలిపారు. ఈ పథకం బీమా నియంత్రణ సంస్థ మార్గదర్శకాల మేరకు అమలవుతుందని తెలిపారు. వివాహ, ప్రసూతి ప్రయోజనాల కోసం “మీ సేవ” ద్వారా దరఖాస్తులు ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వ పథకాల అమలులో మధ్యవర్తుల ప్రమేయం ఉండదని స్పష్టం చేశారు.

Similar News

News November 6, 2025

వాణిజ్య కూడళ్ల సమీపంలో నివాసం ఉండొచ్చా?

image

బహుళ అంతస్తుల భవనాల సమీపంలో, వాణిజ్య కేంద్రాలు, వ్యాపార కూడళ్లలో నివాసం ఉండడం మంచిది కాదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తారు. ఈ ప్రాంతాలలో నిరంతర శబ్దం వల్ల అధిక ప్రతికూల శక్తి వస్తుందంటారు. ‘ఇది ఇంటికి శాంతిని, నివాసితులకు ప్రశాంతతను దూరం చేస్తుంది. వ్యాపార కూడళ్ల చంచలత్వం నివాస స్థలంలో స్థిరత్వాన్ని లోపింపజేస్తుంది. శుభకరమైన జీవనం కోసం ఈ స్థలాలకు దూరంగా ఉండాలి’ అని చెబుతారు. <<-se>>#Vasthu<<>>

News November 6, 2025

సురవరం ప్రతాప్‌రెడ్డి వర్సిటీలో యువకుడి ఆత్మహత్య

image

బాచుపల్లి PS పరిధిలోని సురవరం ప్రతాప్‌రెడ్డి యూనివర్సిటీలో కలకలం రేగింది. పోలీసుల వివరాలిలా.. బ్యాచిలర్ ఆఫ్ డిజైనింగ్ కోర్సులో 3rd ఇయర్ చదువుతున్న పరశురాం అనే వ్యక్తి హాస్టల్‌లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది గమనించిన యూనివర్సిటీ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ధర్నా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.