News November 22, 2025

పెద్దపల్లి: మద్యాహ్న భోజన కార్మికుల సమ్మెకు విస్తృత మద్దతు

image

PDPL జిల్లా మధ్యాహ్న భోజన కార్మికుల 8 రోజుల సమ్మెకు KVPS, CITU, SFI, DYFI సంఘాలు మద్దతు ప్రకటించాయి. ప్రభుత్వాలు మారినా కార్మికుల సమస్యలు పరిష్కారం కాలేదని నాయకులు విమర్శించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. రూ.3,000 గౌరవ వేతనం తక్కువైందని, వాగ్దానం చేసిన రూ.10,000 వేతనం, నిత్యవసర వస్తువులు, వంటగ్యాస్‌ను ప్రభుత్వమే సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.

Similar News

News November 22, 2025

NMMS-2025 పరీక్షకు ఏర్పాట్లు పూర్తి: డీఈవో

image

జిల్లాలో రేపు జరగనున్న NMMS-2025 స్కాలర్‌షిప్ పరీక్షకు 1474 మంది 8వ తరగతి విద్యార్థులు హాజరుకానున్నారని జిల్లా విద్యాధికారి కె.రాము తెలిపారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే పరీక్షకు విద్యార్థులు నిర్ణీత సమయంలోగా పరీక్ష కేంద్రాలకు చేరాలని సూచించారు. జగిత్యాలలో 3, కోరుట్లలో 2, మెట్‌పల్లిలో 1 పరీక్షా కేంద్రం ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

News November 22, 2025

మంచిర్యాల: త్వరలో వాట్సాప్ నంబర్ ఏర్పాటు

image

సింగరేణి సంస్థ సీ అండ్ ఎండీ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించిందని సీ అండ్ ఎంబీ బలరామ్ తెలిపారు. కంపెనీ వ్యాప్తంగా దాదాపు అన్ని ఏరియాల నుంచి 40 మంది కార్మికులు ఫోన్ చేసి వివిధ అంశాలపై మాట్లాడారన్నారు. కార్మికుల ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారానికి వీలుగా త్వరలో ఒక వాట్సాప్ నంబర్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

News November 22, 2025

కోరుట్ల: మనస్థాపంతో యువకుడి ఆత్మహత్య

image

కోరుట్ల పట్టణానికి చెందిన సాంబారు అభిరామ్ అనే యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై చిరంజీవి శనివారం తెలిపారు. గతంలో మృతుని తండ్రి శ్యాంసుందర్ గంగలో మునిగి మృతి చెందగా నాటి నుండి తన తండ్రిని తలుచుకుంటూ బాధపడుతూ ఉండేవాడన్నారు. తండ్రి మృతితో అభిరామ్ మనస్థాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతుని మేనమామ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.