News February 18, 2025
పెద్దపల్లి: ‘మరమ్మతు పనులు వెంటనే ప్రారంభించాలి’

నిర్దేశిత పనులను మండలాల్లో ప్రతి అధికారి సమర్థంగా నిర్వహించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఓదెల మండలంలోని పలు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల తనిఖీ తర్వాత జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆరోగ్య కేంద్రం పరిధిలో ఎన్.సీ.డీ సర్వే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News February 8, 2026
ప్రభుత్వ సంస్థల్లో టీ ఫైబర్ మాత్రమే వాడాలని ఆదేశాలు

TG: ఇకపై ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, స్థానిక సంస్థల కార్యాలయాలన్నీ టీ ఫైబర్ ఇంటర్నెట్ వాడాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రైవేటు సంస్థల ఇంటర్నెట్ వాడకూడదని స్పష్టం చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో 3,484 సంస్థలు టీ ఫైబర్‌ను వినియోగిస్తున్నాయి. 26 జిల్లాల్లోని 8,895 గ్రామపంచాయతీలకు ఈ నెట్‌వర్క్ విస్తరించింది. ఈ సేవలకు వన్ టైం పేమెంట్ రూ.9500 చెల్లించాలి.
News February 8, 2026
అత్తారింటికి ఏ రోజు వెళ్లకూడదంటే?

వారాల నియమాల ప్రకారం కుటుంబ సౌభాగ్యం కోసం కొన్ని ఆచారాలున్నాయి. శుక్రవారం లక్ష్మీప్రదమైన రోజు కాబట్టి, ఆ రోజున ఆడపిల్లలను ఇంటి నుంచి పంపకూడదు. దీన్ని ఇంటి లక్ష్మిని బయటకు పంపినట్టు భావిస్తారు. మంగళవారం ఉద్వేగాలకు, కలహాలకు సంకేతం. ఈ రోజున వివాహిత అత్తగారింటికి వెళ్తే గొడవలు జరిగే ఛాన్స్ ఉంటుందని శాస్త్ర వచనం. ఈ చిన్న జాగ్రత్తలు పాటించడం వల్ల ఇంట్లో శాంతి, సుఖసంతోషాలు నెలకొంటాయని పెద్దల నమ్మకం.
News February 8, 2026
KMR: ఈ సారి మార్పు తథ్యమా! యథాతథమా?

కామారెడ్డి మున్సిపాలిటీ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు ఆయా పార్టీలు రెండేసి సార్లు ఛైర్మన్ పీఠాన్ని అధిరోహించారు. ఎన్టీఆర్ ప్రభంజనంలో టీడీపీ రెండు సార్లు(1988-92, 1995-2000), వైయస్సార్ ప్రభావంతో కాంగ్రెస్ రెండు సార్లు(2000-05, 2005-10), తెలంగాణ రాష్ట్ర పునర్ నిర్మాణ ఆకాంక్షలతో BRS (TRS) (2014-19, 2020-2024) రెండు సార్లు పాలించింది. మరి ఈ సారి ప్రజలు ఎవరికి పట్టం కడతారో చూడాలి మరీ..


