News July 7, 2025

పెద్దపల్లి: మహిళలు వేధింపులకు గురవుతున్నారా..?

image

వేధింపులు ఎదురైతే ఏం చేయాలి? ఎవరి సహాయం కోరాలి? ఇలా అయోమయంలో పడే మహిళలకు భరోసాగా మారుతోంది రామగుండం కమిషనరేట్ షీ టీం. మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఈ బృందం నిత్యం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మహిళా చట్టాలు, రక్షణ కోసం తీసుకుంటున్న చర్యలపై తెలియజేస్తోంది. వేధింపులు ఎదురైతే 6303923700 నంబర్‌కు ఫోన్ చేయాలని, ఆన్‌లైన్ మోసాలకు గురైతే 1930 సైబర్ హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని సూచిస్తున్నారు.

Similar News

News July 7, 2025

రైల్వే స్టేషన్లో మహిళకు ప్రసవం.. ఆర్మీ వైద్యుడిపై ప్రశంసలు

image

UPలోని ఝాన్సీ రైల్వే స్టేషన్లో ఓ నిండు చూలాలికి ఆర్మీ డాక్టర్ మేజర్ రోహిత్ పురుడు పోసి మానవత్వం చాటారు. పన్వేల్ నుంచి గోరఖ్‌పూర్ వెళ్తున్న రైలులో గర్భిణికి పురిటి నొప్పులు వచ్చాయి. అదే మార్గంలో HYD వెళ్లే రైలు కోసం వేచి ఉన్న రోహిత్ విషయం తెలియగా రైల్వే సిబ్బంది సహకారంతో ఆమెకు సురక్షితంగా డెలివరీ చేశారు. అనంతరం తల్లి, బిడ్డను ఆసుపత్రికి తరలించారు. దీంతో ఆర్మీ వైద్యుడిని అందరూ ప్రశంసిస్తున్నారు.

News July 7, 2025

చిత్తూరు జిల్లాలో యూరియా కొరత లేదంట..!

image

చిత్తూరు జిల్లాలో ఖరీఫ్ సీజన్‌కు 9896 Mtsల యూరియా అవసరమని అధికారులు అంచనా వేశారు. జిల్లాలో 10514 mtsల యూరియా నిల్వ చేయగా 6032 mtsలను ఇప్పటి వరకు రైతులు తీసుకెళ్లారు. 4200 Mts యూరియా అందుబాటులో ఉంది. గోడౌన్‌లో 1852 Mts, ప్రైవేట్ డీలర్స్ దగ్గర 1300Mts, RSKలలో 738 Mts, కంపెనీ గోడౌన్‌లో 300Mts మేర నిల్వ ఉండటంతో యూరియా కొరత రాదని చిత్తూరు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళీకృష్ణ Way2Newsకు తెలిపారు.

News July 7, 2025

గొంతుకోసి చిన్నారి హత్య.. చిన్నమ్మే హంతకురాలు?

image

TG: జగిత్యాల కోరుట్లలో ఐదేళ్ల చిన్నారి హితీక్ష హత్య కేసు ఊహించని మలుపు తిరిగింది. కుటుంబ తగాదాలతో హితీక్షను చిన్నమ్మే చంపినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. సీసీ ఫుటేజీ ఆధారంగా ఆమెను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. శనివారం పిల్లలతో ఆడుకునేందుకు వెళ్లిన చిన్నారి బాత్రూమ్‌లో శవమై తేలింది. నిన్న చిన్నారి అంత్యక్రియలు ముగిశాయి. కుటుంబసభ్యులు, స్థానికులు హితీక్షకు కన్నీటి వీడ్కోలు పలికారు.