News February 14, 2025

పెద్దపల్లి: మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్ష

image

జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో బాలల సంరక్షణ చర్యలపై సంబంధిత మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. బాలల సమస్యలపై ఫిర్యాదులు అందించేందుకు 1098 ఫోన్ నంబర్‌కు ఫోన్ చేయాలన్నారు. అనాథ పిల్లలు, సెమీ ఆర్ఫన్ పిల్లలో స్పాన్సర్షిప్‌కు అర్హులైన పిల్లలను గుర్తించి వారి వివరాలు సేకరించాలని కలెక్టర్ ఆదేశించారు. బాల్య వివాహాలు జరగకుండా చూడాలన్నారు.

Similar News

News February 20, 2026

గుంటూరులో స్టూడెంట్ అదృశ్యం..!

image

వేదపాఠశాల విద్యార్థి అదృశ్యమైనట్లు అరండల్ పేట పోలీసులు కేసు నమోదు చేశారు. బాపట్ల (D) సంతమాగులూరు (M) మిన్నెకల్లుకు చెందిన పదిహేనేళ్ల తుర్లపాటి వెంకటసాయి రమేశ్ ఎండ్రాయి వేదపాఠశాలలో చదువుతున్నాడు. రెండ్రోజుల కిందట పాఠశాల నుంచి గుంటూరు శ్రీనగర్‌లోని అమమ్మ ఇంటికి వచ్చాడు. 18న లాడ్జిసెంటర్‌లో ఆటో ఎక్కి కనిపించకుండా పోయాడు. విద్యార్థి తల్లి పద్మప్రియ ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశామన్నారు.

News February 20, 2026

మంచిర్యాల: ప్రేమ.. పెళ్లి.. సూసైడ్

image

అన్నా.. నేను చనిపోతున్నా అంటూ ఫోన్ చేసి వివాహిత ఆత్మహత్య చేసుకుంది. MNCL వాసి మమత(29), నరేశ్‌లది ప్రేమ వివాహం. పెళ్లైన నెల నుంచే కట్నం కోసం అత్తారింటి వారు వేధించసాగారు. ఈనెల 16న ఆస్పత్రి వద్ద వారు దూషించడంతో మనస్తాపం చెందిన మమత.. తీగలగుట్టపల్లి రైల్వే ట్రాక్ సమీపంలో పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేలోపే ప్రాణాలు విడిచింది. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.

News February 20, 2026

కరీంనగర్: ‘ఆసరా’పై ఆశలు చిగురిస్తున్నాయి..!

image

రాష్ట్ర ప్రభుత్వం ‘చేయూత’ పథకం కింద పెన్షన్ల పెంపునకు కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం వృద్ధాప్య, వితంతు పెన్షన్ పొందుతున్న రూ.2,016ను రూ.4,000కు పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. దివ్యాంగులకిచ్చే రూ.4,016 పెన్షన్‌ను రూ.6,000కు పెంచే అవకాశం ఉంది. రానున్న బడ్జెట్‌లో దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఉమ్మడి KNR జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం సుమారు 5.5లక్షల మంది ఆసరా పెన్షన్లు పొందుతున్నారు.