News December 23, 2025

పెద్దపల్లి: మాదక ద్రవ్యాలపై కఠిన చర్యలు: అదనపు కలెక్టర్

image

పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ డి.వేణు మాదక ద్రవ్యాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. విద్యాసంస్థలు, హాస్టల్స్, గురుకుల పాఠశాలల్లో డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, విద్యార్థుల అలవాట్లను పర్యవేక్షించాలని చెప్పారు. మాదక రవాణా, సాగు, వినియోగాన్ని నియంత్రించడానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలి అని సూచించారు.

Similar News

News December 24, 2025

టుడే హెడ్‌లైన్స్

image

*AP నుంచి క్వాంటం టెక్నాలజీలో నోబెల్ గెలిస్తే రూ.100 కోట్లు: CM చంద్రబాబు
*TDP-JSP చెప్పినవి అబద్ధాలని RBI డేటాతో తేలింది: జగన్
*కొత్త సర్పంచులు మంచి పాలన అందించాలి: CM రేవంత్
*KCR గర్జిస్తే సమాధానం చెప్పే దమ్ము CMకి లేదు: KTR
*TGలో DEC 31 అర్ధరాత్రి వరకు వైన్స్, 1AM వరకు బార్స్
*భారత్‌లో 3 కొత్త ఎయిర్ లైన్స్: కేంద్రమంత్రి రామ్మోహన్
*శ్రీలంక ఉమెన్స్‌పై రెండో టీ20లో భారత్ ఘన విజయం

News December 24, 2025

భారత్ అండర్-19 జట్టుపై ICCకి ఫిర్యాదు చేస్తాం: పాక్

image

అండర్-19 ఆసియా కప్-2025 ఫైనల్లో భారత్ టీమ్ తీరుపై ICCకి కంప్లైంట్ చేయనున్నట్టు PCB, ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ మోహ్సిన్ నఖ్వీ చెప్పారు. ‘మ్యాచ్ జరుగుతున్నంత సేపు టీమ్‌ఇండియా ప్లేయర్లు పాక్ ఆటగాళ్లను రెచ్చగొడుతూనే ఉన్నారు. పాలిటిక్స్, స్పోర్ట్స్‌ను వేరుగా చూడాలి. భారత ఆటగాళ్ల తీరుపై ఐసీసీకి ఫిర్యాదు చేస్తాను’ అని తెలిపారు. దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్‌లో అండర్-19 ఆసియా కప్‌ను పాక్ గెలుచుకుంది.

News December 24, 2025

జగిత్యాల జిల్లాలో పెరిగిన హత్యలు: ఎస్పీ

image

మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడారు. జగిత్యాల జిల్లాలో హత్యల సంఖ్య గత సంవత్సరం కంటే పెరిగిందని తెలిపారు. 2023లో 28 హత్యలు జరగగా, ఈ సంవత్సరం ఇప్పటివరకు 29 హత్యలు నమోదయ్యాయని ఆయన వెల్లడించారు. అయితే, మిగతా నేరాల రేటు గత సంవత్సరం కంటే 5 శాతం తగ్గినట్లు వివరించారు. ఈ క్రమంలో సహకరించిన పోలీసులను ఎస్పీ అభినందించారు.