News October 24, 2025

పెద్దపల్లి మీదుగా ప్రత్యేక రైల్వే సర్వీసులు

image

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని చర్లపల్లి-బరౌని మధ్య రెండు ప్రత్యేక వీక్లీ రైళ్లను నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ తెలిపారు. ఈనెల 25న చర్లపల్లి-బరౌని 07093 బరౌని ఎక్స్‌ప్రెస్, 27న బరౌని-చర్లపల్లి 07094ఎక్స్‌ప్రెస్ నడుస్తాయన్నారు. ఈ రైళ్లలో సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్, జనరల్ కోచ్లు ఉంటాయని, జనగామ, KZPT, పెద్దపల్లి, మంచిర్యాల, సిర్పూర్ కాగజ్‌నగర్‌లో రైళ్లు ఆగనున్నాయి.

Similar News

News October 24, 2025

తిలారు: రైలు ఢీకొని ఒకరు మృతి

image

తిలారు రైల్వే స్టేషన్ సమీపంలో డౌన్ లైన్‌లో రైలు ఢీకొని శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు జీఆర్పీ హెచ్‌సీ మధుసూదనరావు తెలిపారు. మృతుడికి 45 ఏళ్లు ఉంటాయాని, నీలం రంగు హాఫ్ హాండ్స్ షర్ట్, నలుపు రంగు జీన్స్ ప్యాంటు ధరించి ఉన్నట్లు తెలిపారు. రైలు పట్టాలు దాటుతున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చునని తెలియజేశారు. ఆచూకీ తెలిసినవారు 91103 05494 నంబర్‌ను సంప్రదించాలన్నారు.

News October 24, 2025

ANU: పరీక్షా ఫలితాలు విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో జులై నెలలో జరిగిన నానో టెక్నాలజీ IV, V ఇయర్స్ సెకండ్ సెమిస్టర్ పరీక్షా ఫలితాలను శుక్రవారం వర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి శివప్రసాదరావు విడుదల చేశారు. ఫలితాల రీవాల్యుయేషన్ కోసం నవంబర్ 4వ తేదీలోపు ఒక్కో సబ్జెక్టుకు రూ.1,860 చెల్లించాలన్నారు. పూర్తి వివరాలకు వర్సిటీలోని సంబంధిత అధికారులను సంప్రదించాలన్నారు.

News October 24, 2025

పత్తి సేకరణలో సందేహాలు నివృత్తి చేయాలి: కలెక్టర్

image

పత్తి రైతుల రిజిస్ట్రేషన్ ప్రారంభించాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా వ్యవసాయ మార్కెటింగ్ అధికారులను ఆదేశించారు. పత్తి, ధాన్యం కొనుగోలు పై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. రైతు సేవా కేంద్రం వారిగా రైతులతో సమావేశం నిర్వహించి పూర్తి వివరాలు తెలియజేయాలన్నారు. ప్రాంతాల వారీగా పత్తి ఉత్పాదకత వివరాలు సమర్పించాలని ఆదేశించారు. పత్తి సేకరణలో తరచూ తలెత్తే సందేహాలను స్పష్టంగా నివృత్తి చేయాలన్నారు.