News January 18, 2026

పెద్దపల్లి: ‘మున్సిపల్ ఎన్నికల్లో బీఎస్పీ పోటీ’

image

తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థులు అన్ని స్థానాల్లో పోటీ చేయనున్నట్లు బీఎస్పీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు ఇరుకుల్ల రాజనర్సయ్య వెల్లడించారు. ఆదివారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించిన పార్టీ సమావేశంలో మాట్లాడుతూ.. జిల్లాలోని రామగుండం కార్పొరేషన్ సహా మంథని, పెద్దపల్లి, సుల్తానాబాద్ మున్సిపాలిటీల్లో పోటీ చేయనున్నట్లు తెలిపారు.

Similar News

News January 27, 2026

ఇంటర్వ్యూతో ICMRలో ఉద్యోగాలు

image

న్యూఢిల్లీలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(<>ICMR<<>>) 3 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి డిగ్రీ, పీజీ/బీటెక్/ఎంటెక్/ఎంఫార్మసీ, ఎంబీఏ/CA/ICWA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు జనవరి 28న ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. కన్సల్టెంట్ పోస్టుకు నెలకు రూ.1,00000-రూ.1,80,000, యంగ్ ప్రొఫెషనల్‌కు రూ.30000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.icmr.gov.in/

News January 27, 2026

నెల్లూరు: ఆసుపత్రికి వస్తారు.. వెళ్తారు!

image

నెల్లూరు జిల్లాలో ఉద్యోగులు సరిగా <<18972466>>పనిచేయడం లేదనే <<>>ఆరోపణలు ఉన్నాయి. ఉదయగిరి(M) గండిపాలెం ఆసుపత్రిలో గతంలో విద్యుత్తు ప్రమాదం జరిగింది. అప్పటి నుంచి ఉదయగిరి ఆసుపత్రిలో ఓ రూము తీసుకుని సిబ్బంది పనిచేస్తున్నారు. గండిపాలెంలో రిపేర్లు పూర్తి అయినప్పటికీ.. ఇక్కడ పనిచేయకుండా వాక్సినేషన్ పేరుతో ఉదయగిరిలోనే ఉంటున్నారు. గండిపాలెం ఆసుపత్రిలో బయోమెట్రిక్ వేసి వెళ్లిపోతుండటంతో రోగులకు సేవలు అందడం లేదు.

News January 27, 2026

ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరలు ఇలా.!

image

ప్రొద్దుటూరులో మంగళవారం బంగారం, వెండి ధరలు ఇలా.
*బంగారం 24 క్యారెట్ 1గ్రాము రూ.16550.00
*బంగారం 22 క్యారెట్ 1గ్రాము రూ.15226.00
*వెండి 10 గ్రాముల ధర: రూ.3580.00