News February 1, 2026
పెద్దపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ అభ్యర్థులు వీరే..!

పూరేళ్ళ శైలజ (1), లక్ష్మి పస్తం (2), మొలగూరి కమల్ (3), కొమ్ము సుధాకర్ (4), గుజ్జుల కుమారస్వామి (5), కట్ట పద్మావతి (6), ఈర్ల స్వరూప (7), ఎరుకల కల్పన (8), అక్కెపల్లి సుజాత (10), అనూష పూదరి (11), దొడ్డుపల్లి జగదీష్ (12), పా గల శ్రీకాంత్ (13), మహమ్మద్ అస్లాం పర్వేజ్ (14), నేతెట్ల కొమురయ్య (15), నంసాని శ్రీనివాస్ (16), తోట ఫణీందర్ (17), భూతగడ్డ సంపత్ (18), నల్లాల పద్మ (19), బండి రమ్యకృష్ణ (20).
Similar News
News February 4, 2026
నారాయణఖేడ్: మున్సిపల్ బరిలో బాబాయి.. అబ్బాయి

నారాయణఖేడ్ మున్సిపల్ ఎన్నికల బరిలో ఒకే కుటుంబానికి చెందిన బాబాయి, అబ్బాయి బరిలో నిలిచారు. జిల్లా ప్రణాళిక సంఘం మాజీ సభ్యులు నగేష్ కుమార్ శెట్కార్ 8వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తుండగా, ఆయన సోదరుడి కుమారుడు సాగర్ శెట్కార్ 7వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఒకే పార్టీ తరఫున వేర్వేరు వార్డుల్లో పోటీ పడుతున్న ఈ బాబాయి, అబ్బాయిల ఎన్నికల ప్రచారం ఆసక్తికరంగా మారింది.
News February 4, 2026
మనుబోలులో విజిలెన్స్ దాడులు.. రూ.కోటి సరుకు స్వాధీనం

మనుబోలులోని పెట్రోల్ బంక్ సమీపంలో జ్యన్తి మల్టీ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్‌పై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. ఎటువంటి బిల్లులు లేకుండా అక్రమంగా ఇండస్త్రిరియల్ ఆయిల్‌ను డీజిల్‌గా విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ తనిఖీల్లో బిల్లులు లేకుండా ఇతర రాష్ట్రాల నుంచి ఆయిల్ తీసుకొచ్చి అమ్ముతున్నారన్నారు. రూ.లక్షా పదివేల లీటర్ల ఆయిల్‌ను, అయిదు ట్యాంకర్లను సీజ్ చేశారు.
News February 4, 2026
ఇవాళ మేడారంలో తిరుగువారం పండుగ

TG: మేడారం, కన్నేపల్లి ఆలయాల్లో సమ్మక్క-సారలమ్మలకు ఇవాళ తిరుగువారం పండుగ నిర్వహించనున్నారు. మహాజాతర ప్రారంభమైన వారం తర్వాత ఈ పండుగ జరుపుతారు. పూజారులు ఆలయాలను శుద్ధి చేసి, ధూపదీపాలు వెలిగించి నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. తిరుగువారం పండుగ రోజున గిరిజన, గిరిజనేతర భక్తులు అమ్మవార్లను దర్శించి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ పండుగతో మహాజాతర పూజా కార్యక్రమాలు పూర్తికానున్నాయి.


