News February 1, 2026
పెద్దపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన

ఆదివారం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే విజయ రమణారావు <<19024178>>అభ్యర్థులను<<>> ప్రకటించారు. గాళ్ళ మల్లయ్య (21), ఉప్పు స్వరూప (22), తాడూరి శ్రీమన్నారాయణ (23), కొట్టే స్వరూప (24), సూది మల్ల అమ్రేష్ (26), ఉనుకొండ సరస్వతి (27), తూముల లత (28), ఇల్లందుల రజని (29), సాజిదాబాను (30), మంథని నర్సింగ్ (31), తిర్రీ శ్రీలత (32), భూతగడ్డ స్వప్న (33), దేవనంది రమాదేవి (35), ముస్కాన్ నాజ్ (36).
Similar News
News February 7, 2026
RCB విజయం.. మంధాన తల్లి పోస్ట్ వైరల్

WPL ఫైనల్లో <<19062605>>RCB ఘన విజయం<<>> సాధించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా సోషల్ మీడియాలో స్మృతి మంధాన తల్లి స్మితకు సంబంధించిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. స్మృతి బ్యాటింగ్ చేసేటప్పుడు ఢిల్లీ బౌలర్లలో ఆమె తన మాజీ ప్రియుడు పలాశ్ ముచ్చల్‌ను ఊహించుకున్నారనే మీమ్‌ను ఇన్‌స్టాలో రీపోస్ట్ చేశారు. దీనిపై ‘సూపర్ ఆంటీ’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు. స్క్రీన్‌షాట్లు వైరల్ కావడంతో కాసేపటికే ఆమె ఆ పోస్టును తొలగించారు.
News February 7, 2026
సిద్దిపేట: డేంజర్.. జిల్లాలోకి పెద్దపులి ఎంటర్

మూడు రోజులుగా జనగామ జిల్లా ప్రజలను భయాందోళనకు గురి చేసిన పెద్దపులి సిద్దిపేట జిల్లాలోకి ప్రవేశించిందని డీఎఫ్‌వో లావణ్య వెల్లడించారు. గురువారం అర్ధరాత్రి రఘునాథపల్లి మండలంలో సంచరించిన పులి శుక్రవారం అర్ధరాత్రి నర్మెట్ట మండలం మీదుగా సిద్దిపేట జిల్లాలోకి వెళ్లిందని తెలిపారు. ఏదేమైనా పులి చిక్కేంత వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
News February 7, 2026
చిత్తూరు: ఏనుగుల దాడులకు ‘హనుమాన్’తో చెక్.!

రామకుప్పం(M)లో ఏనుగు ధాటికి పాడి <<19074524>>ఆవు<<>> మృతి చెందగా, GDనెల్లూరు నియోజకవర్గంలో పంట పొలాలను ఏనుగులు ధ్వంసం చేశాయి. HANUMAN ప్రాజెక్ట్‌లో ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లు ఏర్పాటు చేస్తారు. వెటర్నరీ అసిస్టెంట్, శిక్షణ పొందిన రక్షణ సిబ్బంది, డ్రైవర్, ఆధునిక వాహనాలు, ట్రాంక్విలైజేషన్ పరికరాలు, డ్రోన్లు, నైట్ విజన్ కెమెరాలు అందుబాటులో ఉంటాయి. జంతువులు నివాస ప్రాంతాల్లోకి వెళ్లగానే ప్రజలను అప్రమత్తం చేయనున్నారు.


