News February 14, 2025

పెద్దపల్లి: ముస్లింల సంక్షేమానికి కృషి చేస్తా: ఎమ్మెల్యే

image

ముస్లింల సంక్షేమానికి కృషి చేస్తానని, వారికి ఇచ్చిన మాట ప్రకారం భూమి కేటాయించామని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. ఈ సందర్భంగా గురువారం పెద్దపల్లి పట్టణంలో ఫారన్ మసీదులో ముస్లింలు నిర్వహించిన సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రాఘవపూర్ గ్రామ శివారులో ఇచ్చిన మాట ప్రకారం కబ్రస్థాన్ నిర్మాణానికి రెండు ఎకరాల భూమి కేటాయించామని తెలిపారు. 

Similar News

News September 17, 2025

ఆంధ్రాలో సింగిల్ విండో విధానం కావాలి: దిలీప్ రాజా

image

తెలంగాణ ప్రభుత్వం సినిమా చిత్రీకరణలు, థియేటర్ల అనుమతులను సింగిల్ విండో ద్వారా ఇస్తుందని సినీ దర్శకుడు దిలీప్ రాజా అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆ దిశగా చర్యలు లేవని విమర్శించారు. తెలంగాణలో ‘ఫిల్మ్స్ ఇన్ తెలంగాణ’ వెబ్‌సైట్ ద్వారా అంతర్జాతీయ సినిమాలకు కూడా అనుమతులు లభిస్తాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా సినిమా రంగానికి అవసరమైన మౌలిక సదుపాయాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని ఆయన కోరారు.

News September 17, 2025

HYD: SEP 17.. ఇదే కదా నిజమైన సాతంత్ర్యం!

image

1947, AUG 15.. దేశమంతా స్వేచ్ఛా గాలులు పీల్చుతుంటే HYD ప్రజలు నిజాం, దొరలు, రజాకార్ల నిర్బంధంలో ఉన్నారు. అప్పటికే(1946) తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం పురుడుపోసుకుంది. భారత స్వాతంత్ర్య స్ఫూర్తి HYD సంస్థానాన్ని ఆహ్వానించిందేమో మరి.. ఏళ్లుగా ఏడ్చిన కళ్లు ఎర్రబడ్డాయి. నీ బాంచన్ దొర అన్న జనం బ్యాంచత్ అని రాయి, రప్ప, సుత్తె, కత్తి చేతబట్టి పోరాడారు. చివరకు 1948 SEP 17న ‘ఆపరేషన్ పోలో’తో స్వేచ్ఛను పొందారు.

News September 17, 2025

KNR: సీఎం చేతుల మీదుగా ‘దివ్యదృష్టి’ ఆవిష్కరణ

image

కరీంనగర్ జిల్లా ప్రభుత్వ అంధుల పాఠశాల విద్యార్థులు పాడిన ‘దివ్యదృష్టి’ వీడియో ఆల్బమ్‌ను తెలంగాణ CM రేవంత్ రెడ్డి HYDలోని తన నివాసంలో ఆవిష్కరించారు. సీఎం మాట్లాడుతూ, సుదీర్ఘమైన సంస్కృత శ్లోకాలను కూడా అలవోకగా పాడడం అభినందనీయమని ప్రశంసించారు. ఈ కాలంలో భాష సరిగా పలకడం కూడా కష్టంగా ఉన్న సమయంలో, ఇంత స్పష్టంగా పాడిన విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ పమేలా సత్పతి కూడా పాల్గొన్నారు.