News March 18, 2026
పెద్దపల్లి: ‘మూడు విడతల్లో రైతు భరోసా’

యాసంగి రైతు భరోసా నిధులు మూడు విడతల్లో జమ చేయనున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్ తెలిపారు. CM రేవంత్ రెడ్డి ఈ నెల 22న సిద్దిపేటలో ప్రారంభిస్తారని తెలిపారు. జిల్లాలో 1,51’300 మంది రైతుల ఖాతాలో రూ. 162.52 కోట్లు నిధులు ఏప్రిల్ నెలాఖరులోగా జమ అవుతాయన్నారు. ఫిబ్రవరి 28 నాటికి పట్టాదార్ పాస్ పుస్తకం పొందిన రైతులు నూతనంగా రైతు భరోసా కోసం AEO ల వద్ద మార్చి 25 లోపు నమోదు చేసుకోవాలని సూచించారు.
Similar News
News April 13, 2026
రామచంద్రపురం: జియో కోఆర్డినేషన్ పొరపాట్లు జరగొద్దు: కలెక్టర్

రామచంద్రపురం భూముల రీ సర్వేలో చేపట్టిన జియో కోఆర్డినేషన్‌లో పొరపాట్లకు అవకాశం ఇవ్వొద్దని జిల్లా కలెక్టర్ దివాకర అధికారులకు సూచించారు. రాజేశ్వరరావుపల్లిలో జరుగుతున్న సర్వే తీరును ఆయన పరిశీలించారు. డేటా ఎంట్రీ, జియో కోఆర్డినేషన్‌ను పర్యవేక్షించారు. ఈ సర్వేను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిందని, అధికారులు, సిబ్బంది సమన్వయంతో విజయవంతంగా పూర్తిచేయాలని ఆదేశించారు.
News April 13, 2026
గద్వాల: ‘గడువులోపు సెన్సస్ పనులు పూర్తి చేయాలి’

సెన్సస్–2027 పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో 1,073 హౌస్ లిస్టింగ్ బ్లాక్‌లను గుర్తించి, 1,341 మంది సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. ఎన్యూమరేటర్ల నియామకం, శిక్షణ తక్షణమే పూర్తి చేయాలని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి పెండింగ్ పనులు ముగించాలని కలెక్టర్ సూచించారు.