News December 14, 2025
పెద్దపల్లి: మొత్తం పోలింగ్ 80.84%

పెద్దపల్లి జిల్లాలో రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 112,658 ఓటర్లలో 91,076 మంది ఓటు వేశారు. మొత్తం పోలింగ్ 80.84%గా నమోదయింది. అంతర్గాం మండలంలో అత్యధికంగా 86.40%, జూలపల్లి మండలం 84.75%, పాలకుర్తి మండలం 81.90%, ధర్మారం మండలం 75.57% పోలింగ్ నమోదు కాగా , ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలై 1 గంట వరకు ముగిసింది. ప్రశాంతంగా ఎన్నికలు ముగిశాయి.
Similar News
News December 14, 2025
మహబూబాబాద్: 5వ సారి ఆ కుటుంబానికే సర్పంచ్ పదవి

మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం దాట్ల గ్రామంలో సర్పంచ్‌గా ఇండిపెండెంట్ అభ్యర్థి కొమ్మినేని మంజుల ఘన విజయం సాధించారు. వరుసగా 5వ సారి ఆ కుటుంబానికే గ్రామస్థులు పట్టం కట్టారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ బలపరిచిన కొమ్మినేని రాములమ్మ పై 260 ఓట్ల తేడాతో ఘనవిజయం సాధించారు. ఇండిపెండెంట్ అభ్యర్థులు 10 వార్డులు, కాంగ్రెస్ 2 వార్డుల్లో విజయం సాధించింది.
News December 14, 2025
తిమ్మాజిపేట: టాస్‌తో సర్పంచ్‌గా ఎన్నికైన కాంగ్రెస్ అభ్యర్థి..!

నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం వెంకయపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ మద్దతుగల ఆలేటి ఇందిరా, ప్రత్యర్థి కుప్పిరెడ్డి వెంకటేశ్వరమ్మ మధ్య హోరాహోరీ పోటీ జరిగింది. మొత్తం 543 ఓటర్లు ఉండగా, 472 మంది పోలింగ్‌లో పాల్గొన్నారు. ఇద్దరు అభ్యర్థులకు సమానంగా ఓట్లు పోలవడంతో రిటర్నింగ్ అధికారుల ఆధ్వర్యంలో టాస్ నిర్వహించారు. అదృష్టం ఆలేటి ఇందిరాను వరించింది.
News December 14, 2025
ధర్మసాగర్: సర్పంచులు వీరే!

ధర్మసాగర్ మండలం ధర్మపురంలో BRS బలపరిచిన అభ్యర్థి రమాదేవి విజయం సాధించారు. అలాగే దేవునూరు గ్రామంలో BRS బలపరిచిన అభ్యర్థి ఇంగె రవి గులాబీ జెండా ఎగరేశారు. మరోవైపు కరుణాపురంలో సైతం గులాబీ జెండా ఎగిరింది. ఇక్కడ BRS బలపరిచిన అభ్యర్థి గుర్రపు రీనా గెలుపు ముంగిట నిలిచారు. కడియం శ్రీహరి నియోజకవర్గం పరిధిలో ఉన్న ఈ గ్రామాల్లో గులాబీ జెండా ఎగరడం పట్ల BRS నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


