News July 10, 2025
పెద్దపల్లి: యాక్సిడెంట్‌లో RTC డ్రైవర్ మృతి

రోడ్డు ప్రమాదంలో RTC డ్రైవర్ మృతిచెందిన ఘటన పెద్దపల్లి(D) కాల్వ శ్రీరాంపూర్(M) ఇదులాపూర్ వద్ద గురువారం వెలుగుచూసింది. స్థానికులు తెలిపిన వివరాలు.. ఔట్ సోర్స్ RTC డ్రైవర్‌గా విధులు ముగించుకున్న తోట శ్రీకాంత్(32) బుధవారం రాత్రి బైక్‌పై జాఫర్‌ఖాన్‌పేటకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో మరో బైక్ అతడిని ఢీకొట్టింది. ప్రమాదంలో శ్రీకాంత్ అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News July 11, 2025
రష్మిక విలన్ రోల్ చేస్తోందా?

అల్లు అర్జున్-అట్లీ మూవీలో రష్మిక నటిస్తారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ మూవీలో ఐదుగురు హీరోయిన్లని, అందులో రష్మిక ఒకరని సినీటౌన్‌లో టాక్ నడుస్తోంది. ఇప్పటికే దీపికను హీరోయిన్‌గా పరిచయం చేశారు. మృణాల్ కూడా షూటింగ్‌లో పాల్గొన్నారని చెబుతున్నారు. మిగిలిన 3 పాత్రల్లో రష్మిక, జాన్వీ, భాగ్యశ్రీ పేర్లు వినిపిస్తున్నాయి. రష్మిక పాత్రలో కాస్త నెగటివ్ షేడ్స్ ఉంటాయని, యాక్షన్ సీన్సూ చేస్తారని సమాచారం.
News July 11, 2025
NZB: గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్

నిజామాబాద్ మూడవ టౌన్ పరిధిలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు SI హరిబాబు గురువారం తెలిపారు. పంబౌలి ఏరియాలో గంజాయి విక్రయిస్తున్నారనే పక్క సమాచారం మేరకు పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో షేక్ అఫ్రోజ్, షేక్ అయాజ్ ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వీరు నుంచి 238 గ్రాముల గంజాయిని స్వాధీన పరుచుకొని, రిమాండ్‌కు తరలించారు.
News July 11, 2025
KMR: క్రీడా అకాడమీల్లో ప్రవేశాలకు ఎంపికలు

TG రాష్ట్ర క్రీడా అకాడమీల్లో ఈ ఏడాది ప్రవేశాలకు ఎంపికలు నిర్వహించనున్నట్లు కామారెడ్డి జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి జగన్నాథన్ తెలిపారు. హాకీ, అథ్లెటిక్స్ (గచ్చిబౌలిలో బాలురు, బాలికలకు), హ్యాండ్‌బాల్, ఫుట్‌బాల్ అకాడమీలు (LB స్టేడియంలో బాలురకు మాత్రమే) ఈ ఎంపికలు జూలై 15, 16 తేదీల్లో ఉంటాయన్నారు.12 నుంచి 16 వయస్సు గల అర్హులైన వారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.