News December 20, 2025

పెద్దపల్లి: యాదవ చారిటబుల్ ట్రస్ట్ వాలంటీర్లకు కలెక్టర్ సన్మానం

image

పెద్దపల్లి జిల్లా ప్రధాన ఆసుపత్రిలో మూడు నెలలు వాలంటీర్లుగా సేవలందించిన యాదవ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులను శనివారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సన్మానించారు. కే. స్వాతి, డి. సుజాత, జి. సరోజన, కె. రాజేంద్ర ప్రసాద్‌లకు శాలువాలు కప్పి ఆరోగ్యశాఖ తరఫున అనుభవ ధృవీకరణ పత్రాలు అందజేశారు. సేవా కార్యక్రమాలు అభినందనీయమని, భవిష్యత్‌లో మరిన్ని ప్రజోపయోగ కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు.

Similar News

News December 21, 2025

రాజంపేట: ఎల్లుండి బంద్

image

అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాజంపేటను ప్రకటించాలనే డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. ఇందులో భాగంగా రైల్వేకోడూరు, రాజంపేటలో మంగళవారం బంద్ పాటించాలని రాజంపేట జిల్లా సాధన జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపునిచ్చింది. రాజంపేటలోని R&B భవనంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అన్ని షాపులు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు స్వచ్ఛందంగా మూసివేసి బంద్ పాటించాలని కోరారు.

News December 21, 2025

సిరిసిల్ల: ‘లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం’

image

లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం లభిస్తుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, DLSA చైర్మన్ పి నీరజ అన్నారు. సిరిసిల్లలో నిర్వహించిన లోక్ అదాలత్ లో మాట్లాడుతూ.. కక్షిదారులు లోక్ అదాలత్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పోక్సో, ఫాస్ట్ ట్రాక్ కోర్టు జడ్జి రాధిక జైస్వాల్, DLSA సెక్రటరీ లక్ష్మణచారి, ASP చంద్రయ్య, జూపల్లి శ్రీనివాసరావు, చింతోజు భాస్కర్, పెంట శ్రీనివాస్ పాల్గొన్నారు.

News December 21, 2025

రాజీమార్గమే రాజమార్గం: జిల్లా ప్రధాన న్యాయమూర్తి

image

పంతాలు, పట్టింపులు పక్కనపెట్టి కక్షిదారులు లోక్‌ అదాలత్‌ ద్వారా వివాదాలను పరిష్కరించుకోవాలని యాదాద్రి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ. జయరాజు సూచించారు. ఆదివారం భువనగిరి కోర్టు ఆవరణలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ లోక్‌ అదాలత్‌కు ఆయన హాజరై మాట్లాడారు. రాజీ పడదగిన కేసుల్లో ఉభయ పక్షాలు పరస్పర అంగీకారంతో ముందుకు సాగితే సమయం, ధనం ఆదా అవుతాయన్నారు.