News April 14, 2025
పెద్దపల్లి: యువ వికాసం పథకానికి 34 వేల దరఖాస్తులు

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రాజీవ్ యువ వికాసం పథకానికి పెద్దపల్లి జిల్లాలో 34 వేల దరఖాస్తులు వచ్చినట్లు సంబంధిత అధికారులు సోమవారం తెలిపారు. నిరుద్యోగ యువతకు ఆర్థిక సహాయంతో పాటు శిక్షణ కల్పించేందుకు రూపొందించిన ఈ పథకంపై యువతలో భారీ స్పందన కనిపిస్తోంది. ఇంకా దరఖాస్తు చేయని వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
Similar News
News September 15, 2025
PDPL: విద్యుత్ డిప్లొమో ఇంజినీర్ల సంఘం ఉపాధ్యక్షుడిగా శ్రీనివాస్

తెలంగాణ ఉత్తర మండల విద్యుత్ పంపిణీ సంస్థ(TGNPDCL) పరిధిలోని తెలంగాణ విద్యుత్ డిప్లొమో ఇంజినీర్ల సంఘం (TPDEA) ఉపాధ్యక్షుడిగా పెద్దపల్లి ADE/ SPM అడిచర్ల శ్రీనివాస్ ఎన్నికయ్యారు. ఆదివారం హనుమకొండలో జరిగిన కార్యవర్గం ఎన్నికల్లో నాలుగో సారి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌కు సహచర ఉద్యోగులు అభినందనలు తెలియజేశారు.
News September 15, 2025
15 శాతం వృద్ధిరేటు సాధనే ధ్యేయం: సీఎం చంద్రబాబు

AP: రాష్ట్రంలో తలసరి ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు కలెక్టర్లను ఆదేశించారు. 15 శాతం వృద్ధి రేటు సాధనే ధ్యేయంగా పనిచేయాలని సూచించారు. సచివాలయంలో కలెక్టర్ల సదస్సులో సీఎం మాట్లాడారు. ‘విభజన వల్ల రాష్ట్ర తలసరి ఆదాయం పడిపోయింది. ఆర్థిక అసమానతలు తగ్గించేందుకు పీ-4ను తీసుకువచ్చాం. టెక్నాలజీని ఉపయోగించుకుని హార్డ్ వర్క్ కాకుండా స్మార్ట్ వర్క్ చేయాలి’ అని ఆయన వ్యాఖ్యానించారు.
News September 15, 2025
పత్తిలో కలుపు నివారణకు ఇలా చేయండి

* పత్తి మొలకెత్తిన నెల రోజులకు కలుపు కనిపిస్తే క్విజలాఫాప్ ఇథైల్ 400ML లేదా ప్రోఫాక్విజఫాప్ 250ML, పైరిథయోబాక్ సోడియం 250ML 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
* ప్రతి పది రోజులకొకసారి గొర్రు, గుంటకలతో అంతరకృషి చేయాలి. కలుపును ఏరివేయాలి.
* వర్షాలు ఎక్కువగా ఉండి కలుపు తీయడం కుదరకపోతే పారాక్వాట్ 5ML+ 10గ్రా. యూరియాతో లీటరు నీటికి కలిపి పత్తి మొక్కలపై పడకుండా వరుసల మధ్య మాత్రమే పిచికారీ చేయాలి.