News December 20, 2025

పెద్దపల్లి: రహదారి భద్రతపై జిల్లా కలెక్టర్లతో మంత్రి పొన్నం సమీక్ష

image

రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సురక్షిత డ్రైవింగ్ ద్వారా రహదారి ప్రమాదాలు తగ్గుతాయని తెలిపారు. రోడ్డు భద్రత మాసోత్సవాల 2026పై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి నియమాలు పాటించడం, అవగాహన కార్యక్రమాలు, డ్రంక్ & డ్రైవ్ తనిఖీలు, సీట్ బెల్ట్, హెల్మెట్ పర్యవేక్షణపై దృష్టి పెట్టాలని సూచించారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పాల్గొన్నారు. ప్రతి శాఖ వినూత్న అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు.

Similar News

News December 20, 2025

విశాఖ: సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్

image

విశాఖలో రూమ్స్ తీసుకొని సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఏడుగురిని శనివారం సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఋషికొండ వద్ద బెంగళూరు, కూర్గ్, వెస్ట్ గోదావరి, అనంతపురం ప్రాంతాలకి చెందిన వినోద్ కుమార్, పరుశురాం, సలీం, చంద్రశేఖర్, చంటి, లక్ష్మి శ్రీనివాస్, ఓంకార్‌నాథ్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి బ్యాంక్ పాస్ పుస్తకాలు, రబ్బర్ స్టాంపులు, స్కానర్లు, సిమ్స్, ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

News December 20, 2025

బావుసాయిపేట యువకుడికి నావికాదళంలో సబ్ లెఫ్టినెంట్ హోదా

image

కోనరావుపేట మండలం బావుసాయిపేట గ్రామానికి చెందిన బైరగోని నిహాంత్ గౌడ్ నావికాదళంలో సబ్ లెఫ్టినెంట్‌గా ఎంపికయ్యారు. కోరుకొండ సైనిక్ స్కూల్‌లో చదువుకున్న ఆయన 2021లో యూనియన్ UPSC నిర్వహించిన నేషనల్ డిఫెన్స్ అకాడమీ పరీక్షలో జాతీయ స్థాయిలో 289వ ర్యాంకు సాధించారు. నాలుగేళ్ల పాటు కఠినమైన శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న నిహాంత్, ఇటీవల సబ్ లెఫ్టినెంట్ (గ్రూప్ ఏ అధికారి)గా బాధ్యతలు చేపట్టారు.

News December 20, 2025

ఆయుష్ మార్క్ అంటే ఏమిటి?

image

బంగారం, వస్త్రాలు, అగ్రి ఉత్పత్తులు, మెడిసిన్ నాణ్యతను ధ్రువీకరించేందుకు హాల్ మార్క్, ISI, AGMARK, GMP లాంటి గుర్తులున్నాయి. ఇదే తరహాలో ఆయుర్వేద, యోగా, న్యాచురోపతి, సిద్ధ, యునాని, హోమియోపతి ఉత్పత్తులు, సేవల క్వాలిటీని Ayush Mark ద్వారా గుర్తించవచ్చు. 2009 నుంచే ఇది ఉన్నప్పటికీ గ్లోబల్ స్థాయి గుర్తింపు కోసం మోదీ సరికొత్తగా ప్రారంభించారు. ఇలాంటి వైద్యానికి వెళ్లినప్పుడు ఈ మార్క్‌ను గుర్తుంచుకోండి.