News April 20, 2025
పెద్దపల్లి: రేపటి ప్రజావాణి కార్యక్రమం రద్దు

పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించే రేపటి ప్రజావాణి కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. భూభారతి కొత్త ఆర్ఓఆర్ రెవెన్యూ చట్టం అమలు నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నందున ఈ సోమవారం ప్రజావాణి రద్దు చేస్తున్నట్లు తెలిపారు. కావున జిల్లా ప్రజలు కలెక్టరేట్‌కు రావద్దని సూచించారు.
Similar News
News February 16, 2026
గర్భిణీలకు టిఫా స్కాన్ ఎందుకు?

టిఫా అంటే ‘టార్గెటెడ్ ఇమేజింగ్ ఫర్ ఫ్యూటల్ ఎనామిలీస్’. గర్భిణులకు 18-22 వారాల మధ్య ఈ స్కాన్ చేస్తారు. గర్భంలోని శిశువు తల నుంచి కాలిబొటన వేలు వరకు ప్రతి అవయవాన్ని పరిశీలిస్తారు. శిశువు, మాయ పొజిషన్, ఉమ్మనీరు ఎంత ఉంది అన్నవి ఇందులో గుర్తిస్తారు. ఈ స్కాన్ ద్వారా చిన్నారుల్లో ఏమైనా లోపాలు ఉంటే ముందే గుర్తించి అందుకు తగిన వైద్యం అందించి తల్లీబిడ్డలిద్దరూ ఆరోగ్యంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవచ్చు.
News February 16, 2026
సంగారెడ్డి: ‘రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ మీట్‌లో సత్తా చాటాలి’

రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ మీట్‌లో సత్తా చాటాలని ఎస్పీ పారితోష్ పంకజ్ అన్నారు. సంగారెడ్డి కార్యాలయంలో స్పోర్ట్స్ మీట్ లో పాల్గొని పోలీసులకు టీ షర్ట్‌లను మంగళవారం అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని చెప్పారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రఘునందన్ రావు పాల్గొన్నారు.
News February 16, 2026
SETSలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

సొసైటీ ఫర్ ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్స్ అండ్ సెక్యూరిటీ (SETS) 4 ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. BE/BTech (CS, IT, IS, సైబర్ సెక్యూరిటీ, ECE), ME/MTech అర్హతతో పాటు పని అనుభవం గలవారు FEB 19 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. నెలకు రూ.40,000-రూ.60,000 వరకు చెల్లిస్తారు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://setsindia.in


