News January 24, 2025

పెద్దపల్లి: ‘రైతులకు విజ్ఞప్తి ‘ 

image

పెద్దపల్లి జిల్లాలోని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకం ద్వారా యాసంగి పెట్టుబడి సాయం అందించనుంది. ఇటీవల నిర్వహించిన గ్రామసభల్లో ఆయా గ్రామాల రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. జనవరి 1లోపు పట్టాదారుగా నమోదైన రైతులు బ్యాంకు ఖాతా, ఆధార్ కార్డు, PPBతో ఆయా గ్రామాల రైతు వేదికల్లో AEOలకు దరఖాస్తులు అందజేయాలి. రైతు బంధు పొందిన వారు, గ్రామసభల్లో దరఖాస్తు చేసినవారు మళ్లీ సమర్పించాల్సి పనిలేదన్నారు.

Similar News

News February 25, 2026

ఏలూరు: హెచ్చరిక.. నమ్మి మోసపోవద్దు

image

ఏలూరు జిల్లా పరిధిలోని ఆసుపత్రులలో ఉద్యోగాలు ఇప్పిస్తామనే దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని జిల్లా ఆసుపత్రుల సేవల సమన్వయ అధికారి పాల్ సతీశ్ సూచించారు. ఆయన మాట్లాడుతూ.. నియామక ప్రక్రియ మెరిట్, రోస్టర్ ప్రాతిపదికన అత్యంత పారదర్శకంగా జరుగుతుందన్నారు. హెచ్చరికలు విస్మరించి దళారులను ఆశ్రయిస్తే నష్టపోతారని, నిరుద్యోగులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

News February 25, 2026

గోకవరం: ఏడో తరగతి బాలికను వేధించిన యువకుడి అరెస్ట్

image

గోకవరం మండలంలోని ఓ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న బాలికను వేధించిన కాళ్ల రాకేశ్ అనే యువకుడిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. నిందితుడు నిత్యం వేధిస్తున్నాడని బాలిక తల్లి ఫిర్యాదు చేయడంతో గోకవరం SI పవన్ కుమార్ కేసు నమోదు చేశారు. నిందితుడిని రాజంమహేంద్రవరం కోర్టులో హాజరుపరిచినట్లు SI తెలిపారు.

News February 25, 2026

VZM: సుప్రీంకోర్టు నుంచి అంటూ ఫోన్.. భారీగా దోపిడీ

image

విశాఖలోని ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి‌కి సుప్రీంకోర్టు నుంచి మాట్లాడుతున్నానంటూ ఓ వ్యక్తి ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆర్టీజీఎస్ ద్వారా రూ.89 లక్షలు కాజేయడంతో నష్టపోయానని తెలుసుకున్న రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విజయనగరానికి చెందిన సీహెచ్ రవి ఈ నేరానికి పాల్పడినట్లు గుర్తించి పోలీసులు అరెస్ట్ చేశారు.