News October 16, 2025
పెద్దపల్లి: ‘రైతులు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు’

2025 అక్టోబర్ 16 వరకు 517 వ్యవసాయ విద్యుత్ సర్వీసులు విడుదల చేశామని పెద్దపల్లి సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజినీర్ V. గంగాధర్ తెలిపారు. 3 నెలల్లో మరింత మంజూరు చేయడానికి ప్రయత్నిస్తామన్నారు. ఎక్కడా మెటీరియల్ కొరత లేదని, రైతులు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రతి దశలో స్టేటస్ మెసేజులు పంపి, పారదర్శకతతో సర్వీసులు అందిస్తున్నామని అన్నారు. సమస్యలు ఉంటే 1912 కి ఫోన్ చేయాలని కోరారు.
Similar News
News October 17, 2025
మహిళలకు ఎడమ కన్ను అదిరితే?

స్త్రీలకు తరచుగా ఎడమ కన్ను అదిరితే శుభప్రదమని పండితులు చెబుతున్నారు. ఇది త్వరలో కొత్త వస్త్రాలు, ఆనందకరమైన స్నేహాలు, భాగస్వామితో మంచి అనుబంధం వంటి శుభప్రదమైన ప్రయాణ యోగాన్ని సూచించే దైవిక సంకేతమని అంటున్నారు. కెరీర్‌లో విజయం సాధించే అవకాశాలుంటాయని చెబుతున్నారు. అయితే వివాహితకి కుడి కన్ను అదరడం చెడు శకునం అని పేర్కొంటున్నారు. దీనివల్ల భవిష్యత్తులో సమస్యలు, ఆటంకాలు ఎదురుకావచ్చని అంటున్నారు.
News October 17, 2025
రన్స్ చేస్తే ఓకే.. చేయలేదో!

INDvsAUS మధ్య 3 మ్యాచుల వన్డే సిరీస్ ఈ నెల 19 నుంచి ప్రారంభం కానుంది. దీంతో అందరి దృష్టి స్టార్ ప్లేయర్లు విరాట్, రోహిత్‌లపైనే ఉంది. వచ్చే వన్డే వరల్డ్‌కప్ జట్టులో స్థానం దక్కాలంటే వీరు ఈ సిరీస్‌లో రాణించడం కీలకం. అదే విఫలమయ్యారో ఇబ్బందులు తప్పవు. ఇప్పటికే వారి ప్రాతినిధ్యంపై సెలక్షన్ కమిటీ, కోచ్ క్లారిటీ ఇవ్వలేదు. కాగా AUSలో వీరిద్దరికీ మంచి రికార్డ్ ఉంది. రోహిత్, కోహ్లీ చెరో 5 సెంచరీలు బాదారు.
News October 17, 2025
అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం భగభగలు

అంతర్జాతీయ మార్కెట్(COMEX)లో బంగారం ధరలు రికార్డులు తిరగరాస్తున్నాయి. నిన్న ఔన్సు $4250 ఉండగా, ఇవాళ అది $4300 దాటేసింది. అంతేకాకుండా మార్కెట్ క్యాప్ విలువ $30 ట్రిలియన్స్ క్రాస్ అయింది. ఒక అసెట్ ఈ మార్క్‌ను దాటడం చరిత్రలో ఇదే మొదటిసారి. US-చైనా ట్రేడ్ వార్, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వంటి గ్లోబల్ టెన్షన్స్ వల్లే పెట్టుబడిదారులు బంగారాన్ని సేఫ్ అసెట్‌గా భావిస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.