News November 27, 2025

పెద్దపల్లి: ‘వంట సరుకులు ప్రభుత్వమే సరఫరా చేయాలి’

image

వంట సరుకులు ప్రభుత్వమే సరఫరా చేయాలని ఏఐటీయూసీ మధ్యాహ్న భోజన కార్మికుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో ఎనిమిది రోజులుగా మధ్యాహ్న భోజన కార్మికుల సమ్మెను బుధవారం ఆయన విరమింపజేశారు. అనంతరం పూసాల రమేశ్ అధ్యక్షతన నిర్వహించిన ద్వితీయ మహాసభలో మాట్లాడారు. సమస్యలు పరిష్కరించకుంటే డిసెంబర్ లో సమ్మె చేస్తామన్నారు. సదానందం, సునీల్, లావణ్య కళావతి తదితరులు పాల్గొన్నారు.

Similar News

News November 27, 2025

అమరావతిలో ఏర్పాటు కానున్న కాస్మోస్ ప్లానిటోరియం

image

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ అమరావతిలో ప్లానిటోరియం ఏర్పాటు చేయనుంది. రాజధానిలో కాస్మోస్ ప్లానిటోరియం ఏర్పాటుకై CRDA అధికారులతో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ ఎంఓయూ చేసుకోనుంది. ఈ నెల 28న అమరావతిలో బ్యాంకుల ప్రధాన కార్యాలయాల నిర్మాణ పనుల శంకుస్థాపన జరగనున్న సందర్భంగా ఈ ఎంఓయూ జరగనున్నట్లు CRDA కమిషనర్ కె. కన్నబాబు ఐఏఎస్ ఓ ప్రకటన విడుదల చేశారు.

News November 27, 2025

ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు

image

*TG: పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై హైకోర్టులో పిటిషన్లు.. రేపు విచారణ
*SAతో టెస్ట్ సిరీస్‌లో IND ఘోర ఓటమి.. 2-0తో వైట్‌వాష్
*AP: మరో 15 ఏళ్లు కూటమి ప్రభుత్వమే: పవన్ కళ్యాణ్‌
*రేవంత్ రూ.50వేల కోట్ల పవర్ స్కాం: హరీశ్‌
*APలో స్టూడెంట్ అసెంబ్లీ.. ప్రశ్నలు, వివరణలతో ఆకట్టుకున్నవిద్యార్థులు
*బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. రేపటికి వాయుగుండంగా మారవచ్చన్న APSDMA

News November 27, 2025

HNK: వన్యప్రాణుల సంరక్షణే ప్రభుత్వ ఎజెండా: మంత్రి

image

అడవులు, వన్యప్రాణులను సంరక్షించడమే తమ ప్రజా ప్రభుత్వ ఎజెండా అని మంత్రి కొండా సురేఖ తెలిపారు. హైదరాబాద్‌లోని అర‌ణ్యభవన్‌లో ఆమె స్టేట్‌-లెవల్ టైగర్ ప్రొటెక్షన్ అండ్ మానిటరింగ్ సెల్‌ను ప్రారంభించారు. ప్రాణుల మనుగడపైనే మన ఉనికి ఆధారపడి ఉందని ప్రజలు నిత్యం గుర్తుంచుకోవాలని మంత్రి సూచించారు.