News February 12, 2025

పెద్దపల్లి: వామనరావు దంపతుల హత్య కేసుపై సుప్రీంకోర్టులో విచారణ

image

న్యాయవాది వామనరావు దంపతుల హత్య కేసుపై సుప్రీంకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. కోర్టు ఆదేశిస్తే దర్యాప్తు చేయడానికి అభ్యంతరం లేదని సీబీఐ తరఫు న్యాయవాది తెలిపారు. ఈ కేసును CBIకి అప్పగించేందుకు ప్రభుత్వానికి కూడా అభ్యంతరం లేదని ఇప్పటికే తేల్చి చెప్పింది. తమపై లేని ఆరోపణలు చేసి నిందితులుగా చేర్చారని పుట్ట మధు తరఫు న్యాయవాది కేసు కొట్టివేయాలని కోర్టును కోరారు. కోర్టు కేసును 2 వారాలకు వాయిదా వేసింది.

Similar News

News February 12, 2025

ఖమ్మం: రూ.91 లక్షలకు వ్యాపారి దివాలా పిటిషన్

image

ఖమ్మం పట్టణం శ్రీనివాస నగర్ కు చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి రూ.91,04,593 లకు దివాళా పిటిషన్‌ దాఖలు చేశాడు. ఫిర్యాదుదారుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు. ఈ వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి అధిక వడ్డీలకు పలువురి వద్ద అప్పు చేశారు. వ్యాపారంలో తీవ్రంగా నష్టం రావడంతో అప్పు తీర్చే మార్గం లేకపోవడంతో పదిమంది రుణదాతలను ప్రతివాదులుగా చేరుస్తూ దివాలా పిటిషన్ మంగళవారం స్థానిక కోర్టులో దాఖలు చేశాడు.

News February 12, 2025

NRPT: మన్యంకొండ జాతరకు ప్రత్యేక బస్ సర్వీసులు

image

మన్యంకొండ జాతర సందర్భంగా నారాయణపేట బస్ డిపో నుండి ప్రత్యేక బస్ సర్వీసులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ లావణ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రేపు ఎల్లుండి (బుధవారం, గురువారం) రెండు రోజుల పాటు భక్తుల సౌకర్యం కొరకు బస్ సర్వీసులు నడిపిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రత్యేక బస్ సర్వీసులను పట్టణం తోపాటు చుట్టుపక్కల గ్రామాల భక్తులు, ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

News February 12, 2025

అధికారులు ప్రతినెలా 3-4 జిల్లాల్లో తిరగాలి: సీఎం

image

AP: గ్రూప్-1 అధికారులతో సహా ప్రతి ఒక్కరూ ఏప్రిల్ నుంచి ప్రతి నెలా 3-4 జిల్లాల్లో పర్యటించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఉన్నతాధికారులు గ్రామాలకు వెళ్లే అంశంపై ప్రణాళిక రూపొందిస్తామన్నారు. రెవెన్యూ, పోలీస్, విద్య, వైద్య శాఖలకు సంబంధించి ప్రజల నుంచి ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయని, వాటిని పరిష్కరించాలని సూచించారు. ఒక్కొక్క ఉన్నతాధికారి ఒక్కో జిల్లాను దత్తత తీసుకోవాలని పేర్కొన్నారు.

error: Content is protected !!