News February 20, 2026
పెద్దపల్లి: విద్యార్థులను అభినందించిన కలెక్టర్

హైదరాబాద్ లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సి.డబ్ల్యూ.ఎస్.ఎన్ క్రీడల్లో ప్రతిభ కనబరిచిన జిల్లా విద్యార్థులను పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష కలెక్టరేట్‌లో అభినందించారు. జిల్లాకు చెందిన 20 మంది విద్యార్థులు పాల్గొనగా బడుగు సందీప్ జిగ్‌జాగ్ వాకింగ్‌లో, ఎడునూరి పౌర్ణమి చెస్‌లో, కటకం శ్రీరామ్ చరణ్ పరుగుపందెం, మ్యూజికల్ చైర్ తదితర విభాగాల్లో విజేతలయ్యారు. డీఈవో శారద, ఐఈ కోఆర్డినేటర్ కవిత పాల్గొన్నారు.
Similar News
News February 23, 2026
విశాఖపట్నంలో 38 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

విశాఖపట్నం DMHO 38 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ప్రభుత్వ ఆస్పత్రులు, పట్టణ PHCలో కాంట్రాక్ట్ విధానంలో ఈ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హతగల అభ్యర్థులు FEB 26వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి టెన్త్, డీఫార్మసీ, బీఫార్మసీ, DMLT, MLT, డిగ్రీ, BPT, స్పీచ్ &లాంగ్వేజ్ పాథాలజీ, ఆప్టోమెట్రీ, MSc(డిజబిలిటీ స్టడీస్), BEd(స్పెషల్ ఎడ్యుకేషన్), PG(చైల్డ్ సైకాలజీ), BDS/BSc ఉత్తీర్ణులు అర్హులు.
News February 23, 2026
సీఎం కప్ ఫుట్‌బాల్ ఛాంపియన్స్‌గా నల్గొండ!

HYDలో జరిగిన సీఎం కప్ రాష్ట్రస్థాయి బాలికల ఫుట్‌బాల్ పోటీల్లో నల్గొండ జట్టు సంచలనం సృష్టించింది. సోమవారం జరిగిన ఫైనల్ పోరులో నిజామాబాద్ జట్టుపై 4-2 గోల్స్ తేడాతో విజయం సాధించి గోల్డ్ మెడల్ కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా DYSO అక్బర్ అలీ మాట్లాడుతూ.. నల్గొండ క్రీడాకారిణులు అద్భుత ప్రతిభ కనబరిచారని కొనియాడారు. జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి గిరిబాబు తదితరులు విజేతలను అభినందించారు.
News February 23, 2026
శ్రీకాకుళం: ప్రయాణికులకు గమనిక

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈస్ట్ కోస్ట్ రైల్వే శాఖ శుభవార్త తెలిపింది. శ్రీకాకుళం జిల్లా మీదుగా ప్రయాణించే భువనేశ్వర్-బెంగళూరు-భువనేశ్వర్ (రైలు నం.18463/64) ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ రైలుకు 3వ ఏసీ భోగిని అదనంగా ఏర్పాటు చేయనున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే శాఖ జనరల్ మేనేజర్ పరమేశ్వర్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ రైలు శ్రీకాకుళం రోడ్డు, పలాస, సోంపేట, ఇచ్ఛాపురం తదితర రైల్వే స్టేషన్లలో ఆగనుంది.


