News August 14, 2025
పెద్దపల్లి: ‘విద్యార్థులకు అవగాహన కల్పించాలి’

జిల్లాలో ఉన్న ప్రాంతీయ టాస్క్ సెంటర్ ద్వారా అందించే కోర్సులపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో యువతకు ఉపాధి కల్పనపై డిగ్రీ, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ లతో సమీక్ష నిర్వహించారు. డిగ్రీ, ఇంజనీరింగ్ ముగిసిన విద్యార్దులు టాస్క్ కోర్సులలో నమోదు చేసుకోవాలన్నారు. టామ్ కామ్ ద్వారా విదేశాలలో ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చు కోవాలని సూచించారు.
Similar News
News August 14, 2025
SRSP UPDATE: 45.758 TMCలకు చేరిన నీటిమట్టం

అల్పపీడన ద్రోణితో కురుస్తున్న వర్షాలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో మెల్లగా పెరుగుతోంది. గురువారం మధ్యాహ్నానికి నీటిమట్టం 45.758 TMCలకు చేరిందని ప్రాజెక్టు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఇన్ ఫ్లో 13,910 క్యూసెక్కుల నీరు వస్తుండగా దిగువకు 4,713 క్యూసెక్కులు వదులుతున్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు.
News August 14, 2025
యువతిపై గ్యాంగ్‌రేప్.. 10 మంది అరెస్ట్

TG: స్నేహం, ప్రేమ అంటూ యువతి(18)ని నమ్మించి ఆమెపై 10 మంది అత్యాచారానికి పాల్పడిన ఘటన జనగామలో సంచలనం సృష్టించింది. తొలుత ఓ యువకుడు ప్రేమ పేరుతో దగ్గరై అఘాయిత్యానికి పాల్పడగా, జూన్‌లో అతడి స్నేహితులూ ఆమెకు దగ్గరయ్యారు. మాట్లాడుకుందామని పిలిచి కారులో ఓ రూమ్‌కు తీసుకెళ్లి ఒకరి తర్వాత ఒకరు ఆమెను శారీరకంగా వాడుకున్నారు. తన చిన్నమ్మ సాయంతో యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులు అరెస్టయ్యారు.
News August 14, 2025
భద్రాచల ఆలయానికి ISO గుర్తింపు

భద్రాచలం దేవస్థానానికి ISO గుర్తింపు లభించింది. దీనిని తెలంగాణ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చేతులు మీదుగా దేవస్థానం కార్యనిర్వహణ అధికారి రమాదేవికి సర్టిఫికెట్‌ను ISO డైరెక్టర్ శివయ్య అందించారు. కాగా, ISO అనేది ఉత్పత్తి నాణ్యత, భద్రత, సామర్థ్యాన్ని ధ్రువీకరించే ఒక గుర్తింపు సంస్థ అని తెలిపారు.