News February 1, 2025
పెద్దపల్లి: విద్యా కమిషన్ ప్రజా అభిప్రాయ సేకరణ: కలెక్టర్

పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్లో ఫిబ్రవరి 4న తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్ రాష్ట్ర నూతన విద్య పాలసీ రూపకల్పన పై ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర రాష్ట్ర విద్యా పాలసీ రూపకల్పన కోసం విద్యా కమిషన్కు బాధ్యతలు అప్పగించిందని, అభిప్రాయాలను విద్యా కమిషన్కు తెలియజేయాలని పేర్కొన్నారు.
Similar News
News January 9, 2026
ఐనవోలు జాతర ఏర్పాట్లు పక్కాగా ఉండాలి: కలెక్టర్

ఈనెల 13 నుంచి ప్రారంభం కానున్న ఐనవోలు మల్లికార్జున స్వామి జాతరను విజయవంతం చేయాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆలయ ఏర్పాట్లను పరిశీలించిన ఆమె, భక్తులకు మంచినీరు, పారిశుధ్యం, క్యూలైన్ల వద్ద ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పనులు పూర్తి చేయాలని సూచించారు. అంతకుముందు కలెక్టర్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
News January 9, 2026
భద్రాద్రి: 22 మందిని కుష్ఠు వ్యాధిగ్రస్థులుగా గుర్తించాం

భద్రాద్రి జిల్లాలో కుష్ఠు వ్యాధిగ్రస్తులకు గుర్తింపు సర్వే జనవరి 31న ముగిసిందని DMHO తుకారాం రాథోడ్ తెలిపారు. మొత్తం 1708 మందిని కుష్ఠు వ్యాధి అనుమానితులుగా గుర్తించామన్నారు. ఈనెల 1 నుంచి ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉన్న వైద్యులు ఉప కేంద్రాల్లో డీపీఎంఓలు పరీక్షించి నిర్ధారణ చేయడం జరుగుతుందన్నారు. ఇప్పటి వరకు 1013 మందిని పరీక్షించి 22 మందిని వ్యాధిగ్రస్థులుగా నిర్ధారించామన్నారు.
News January 9, 2026
వేములవాడ: ఈ నెల 21న కోడెల పంపిణీ

వేములవాడ పట్టణం తిప్పాపూర్లోని గోశాలలో ఈ నెల 21న కోడెలను పంపిణీ చేయనున్నట్లు ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఒక ప్రకటనలో తెలిపారు. 300 కోడెలను పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా, పరిసర జిల్లాల రైతులు అర్హులని స్పష్టం చేశారు. కోడెల కోసం 1.5 నుంచి 5 ఎకరాల వరకు సాగు భూమి ఉన్న సన్నకారు, చిన్నకారు రైతులు అర్హులన్నారు.


