News March 20, 2024

పెద్దపల్లి: విద్యుత్ షాక్‌తో రైతు మృతి

image

పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కనగర్తి గ్రామంలో విద్యుత్ షాక్‌తో రైతు మృతి చెందిన ఘటన జరిగింది. మంగళవారం రాత్రి ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది. దీంతో పొలం గట్టుపై విద్యుత్ తీగలు పడ్డాయి. బుధవారం ఉదయం రైతు పొలం పనులకు వెళ్ళగా.. విద్యుత్ వైర్లు ప్రమాదవశాత్తు తగిలి రాజయ్య అక్కడికక్కడే మృతి చెందినట్టు గ్రామస్థులు తెలిపారు. ఘటనా స్థలానికి పొత్కపల్లి ఎస్సై చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News September 5, 2025

కొత్తపల్లి- హుస్నాబాద్ 4 లైన్ పనులపై కలెక్టర్ సమీక్ష

image

KNR(కొత్తపల్లి)- హుస్నాబాద్ నాలుగు వరుసల రహదారి నిర్మాణం వేగవంతం కోసం అవసరమైన చర్యలపై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సంబంధిత అధికారులతో కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో గురువారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 4వరుసల రహదారికి ఇప్పటికే మార్కింగ్ పూర్తయినందున ఎలక్ట్రికల్ వర్క్స్, బావుల పూడ్చివేత, చెట్లు కత్తిరించడం వంటి పనులను వేగవంతం చేయాలన్నారు. గ్రామసభలు ఏర్పాటు చేసి తీర్మానం చేయాలన్నారు.

News September 5, 2025

KNR: ఈవీఎం గోదాంను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్

image

KNR జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం సమీపంలో ఉన్న ఈవీఎం గోదాంను అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్ గురువారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం మార్గనిర్దేశాల మేరకు ఎప్పటికప్పుడు EVM, వీవీ ప్యాట్ గోదాంను తనిఖీ చేసి సమగ్ర నివేదికను పంపిస్తున్నట్లు తెలిపారు. EVMల రక్షణ, భద్రతకు సంబంధించిన ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు.

News September 5, 2025

జాతీయస్థాయి పోటీలకు చొప్పదండి నవోదయ విద్యార్థులు

image

ఢిల్లీలో నిర్వహించే జాతీయ స్థాయి కళా ఉత్సవ్- 2025 పోటీలకు చొప్పదండి జవహర్ నవోదయ నుంచి ఇద్దరు విద్యార్థులు ఎంపికయ్యారు. గురునాథం వంశీ(10వ తరగతి), ఎం.కార్తికేయ(9వ తరగతి) ఈనెల 2, 3 తేదీల్లో ఆంధ్రప్రదేశ్, ఒంగోలు నవోదయ విద్యాలయంలో నిర్వహించిన రీజనల్ లెవెల్ కళా ఉత్సవ్- 2025 పోటీల్లో పాల్గొన్నారు. అక్కడ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. విజేతలను ప్రిన్సిపల్ బ్రహ్మానంద రెడ్డి అభినందించారు.