News December 15, 2025
పెద్దపల్లి: వీ- హబ్ పనులు వెంటనే పూర్తి చేయాలి: కలెక్టర్

పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సోమవారం రంగంపల్లిలో నిర్మిస్తున్న కొత్త వీ- హబ్ భవనాన్ని పరిశీలించారు. సీసీ కెమెరాలు, ఏసీలు తదితర పెండింగ్ పనులు 3 రోజుల్లో పూర్తిచేయాలని సూచించారు. కాగా, మహిళలకు పారిశ్రామిక శిక్షణ, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడానికి ఈ భవనం ఉపయోగపడనుంది. ఈ పర్యటనలో గ్రామీణ అభివృద్ధి అధికారి కాళిందిని, పంచాయతీరాజ్ అసిస్టెంట్ ఇంజినీర్ పవన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Similar News
News December 18, 2025
కరీంనగర్: కొత్త సర్పంచులు.. పాత సమస్యలు తీరేనా..?

గ్రామాల్లో రెండేళ్లుగా సర్పంచ్ పాలన లేకపోవడంతో సమస్యలు పేరుకుపోయాయి. తాగునీరు, పారిశుద్ధ్యం, వీధి దీపాలు, అభివృద్ధి పనులు మధ్యలో ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో తాజాగా 3 విడతల్లో జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్(D)లో కొత్త సర్పంచ్‌లు బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఇక గ్రామాల్లోని సమస్యల పరిష్కారం వీరికి పెద్ద సవాలనే చెప్పాలి. మరి మీమీ గ్రామాల్లో నెలకొన్న ప్రధాన సమస్యలేంటో COMMENT రూపంలో తెలియజేయండి.
News December 18, 2025
ఆ Better Luck Next Time బెటర్ కదా!

PhonePe, GPay, Paytm తదితర UPI యాప్స్‌లో Cash Back చూసి ఎన్నాళ్లైంది. మొదట్లో డబ్బులు ఆఫర్ చేసిన యాప్స్ మధ్యలో Better Luck Next Time కార్డ్స్ యాడ్ చేశాయి. కస్టమర్స్ పెరిగాక స్ట్రాటజీ అమలు టైమ్ వచ్చిందని షాపింగ్ ప్రమోషన్స్‌నే వోచర్స్‌గా ఇస్తున్నాయి. స్క్రాచ్ చేశాక డిస్కౌంట్ వోచర్స్ కన్పిస్తే.. వాటికంటే B.L.N.T కార్డ్ బెటర్ అని యూజర్స్ ఫీలవుతున్నారు. మీకు చివరగా ఎప్పుడు CB వచ్చింది? కామెంట్ చేయండి.
News December 18, 2025
మన శరీరంలో ‘108’ ప్రాముఖ్యత

మన శరీరంలో మొత్తం 108 శక్తి రేఖలు ఉంటాయి. వాటిని మనం నాడులు అని పిలుస్తాం. ఈ నాడులు మన శరీరంలోని 7 ప్రధాన చక్రాల ఏర్పాటుకు, వాటి సమతుల్యతకు సహాయపడతాయి. మనం ఈ 108 నాడులపై దృష్టి పెడితే హృదయ చక్రంలోని అసమతుల్యతను తొలగించవచ్చట. అన్ని చక్రాలు ఒకదానిపై మరొకటి ఆధారపడి పనిచేస్తాయి కాబట్టి, ఆరోగ్యం కోసం అన్ని చక్రాల శ్రేయస్సును కాపాడుకోవాలని యోగా నిపుణులు సూచిస్తున్నారు.


