News January 21, 2026
పెద్దపల్లి: వేసవిలో నీటి ఎద్దడి రాకుండా చూడాలి: కలెక్టర్

పెద్దపల్లి జిల్లాలో రాబోయే వేసవిలో జిల్లాలో తాగునీటి ఎద్దడి కలగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో DWSM విభాగంపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ప్రజలకు నీటి సమస్య రాకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. మిషన్ భగీరథ పనులను పర్యవేక్షిస్తూ, ప్రతి గ్రామానికి నీరు అందేలా చూడాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
Similar News
News February 8, 2026
వనపర్తి: మున్సిపల్ ఎన్నికల్లో త్రిముఖ పోరు!

వనపర్తి మున్సిపల్ ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది. ఈ నెల 11న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య బలమైన త్రిముఖ పోటీ నెలకొంది. అగ్రనేతల పేర్లతో అభ్యర్థులు ప్రచారం నిర్వహిస్తుండగా, స్వతంత్ర అభ్యర్థులు ఎవరి ఓట్లు చీలుస్తారో అన్న ఉత్కంఠ సర్వత్ర వ్యక్తమవుతోంది.
News February 8, 2026
ఐర్లాండ్ టార్గెట్ ఎంతంటే?

T20WC: ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక తడబడి నిలబడింది. తొలుత బ్యాటర్లు పేలవ ప్రదర్శనతో నిరాశ పరిచినా మెండిస్ ద్వయం అదరగొట్టింది. 20 ఓవర్లలో 163/6 రన్స్ చేసింది. కుశాల్ మెండిస్(56), కమిందు మెండిస్(44), నిస్సంక(24) మాత్రమే రాణించారు. IRE బౌలర్లు జార్జ్, మెక్కార్తీ చెరో 2, మార్క్ అడైర్, డెలానీలు చెరో వికెట్ తీశారు. ఐర్లాండ్ 20 ఓవర్లలో 164 రన్స్ చేయాలి.
News February 8, 2026
ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షకు 162 మంది గైర్హాజరు: ఆర్ఐవో

ఏలూరు జిల్లాలో ఆదివారం జరిగిన ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు 3,454 మంది హాజరు కాగా 162 మంది విద్యార్థులు గైర్హాజరు అయ్యారని ఆర్ఐవో యోహాన్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఫిబ్రవరి 23 నుంచి జరిగే థియరీ పరీక్షలు సీసీ కెమెరాల నిర్వహణలో జరుగుతాయన్నారు. పరీక్షా కేంద్రాలలోకి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించమని స్పష్టం చేశారు.


