News February 18, 2025

పెద్దపల్లి: సంస్థ భవిష్యత్తు ప్రతి ఒక్కరి బాధ్యత: CMD

image

సింగరేణి సంస్థ భవిష్యత్తు ప్రతి ఒక్కరి బాధ్యత అని, సక్రమంగా విధులు నిర్వహించాలని, అలసత్వం ప్రదర్శించే వారికి కంపెనీలో స్థానం ఉండదని సంస్థ CMD బలరాం స్పష్టం చేశారు. సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాల GMలు, 39 గనులకు సంబంధించిన ప్రాజెక్టు అధికారులు, ఏజెంట్లతో తొలిసారిగా HYD సింగరేణి భవన్ నుంచి ముఖాముఖి సమీక్ష నిర్వహించారు. ఆయా ఏరియాలో నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలని ఆయన ఆదేశించారు.

Similar News

News March 14, 2025

వరంగల్: నగర ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన మేయర్  

image

హోలీ పండుగ సందర్భంగా నగర మేయర్ గుండు సుధారాణి నగర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ ఆప్యాయత సంతోషాల హరివిల్లుగా, శాంతి సౌభ్రాతృత్వానికి ప్రత్యేకంగా నిలిచే ఈ హోలీ పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలన్నారు. సహజ సిద్ధమైన రంగులతో సాంప్రదాయ పద్ధతులతో ఈ రంగుల పండుగను ఆనందంతో సంతోషంగా జరుపుకోవాలని మేయర్ ఆకాంక్షించారు. 

News March 14, 2025

KMR: జిల్లా కోర్టు సంచలన తీర్పు

image

హత్య కేసులో KMR జిల్లా కోర్టు గురువారం సంచలన తీర్పు వెలువరించింది. జిల్లా SP రాజేష్ చంద్ర వివరాలిలా.. మాల్తుమ్మెద వాసి రామ కృష్ణయ్యకు, కర్రె రాజయ్యతో తగాదాలు ఉన్నాయి. ఈ విషయంలో పెద్దల సమక్షంలో మాట్లాడుతుండగా..రాజయ్య, రామ కృష్ణయ్య తలపై కర్రతో కొట్టి చంపాడు. నాగిరెడ్డి పేట్ PSలో కేసు నమోదైంది. విచారణ అనంతరం జిల్లా జడ్జి వరప్రసాద్ రాజయ్యకు జీవిత ఖైదు, రూ.10 వేల జరిమాన విధిస్తూ తీర్పు ఇచ్చారు.

News March 14, 2025

సంగారెడ్డి: ‘ఆస్పత్రులు, స్కానింగ్ సెంటర్లు రూల్స్ పాటించాలి’

image

జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రులు స్కానింగ్ సెంటర్లు నిబంధనలు పాటించాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ గాయత్రీ దేవి తెలిపారు. జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో గురువారం సమావేశం నిర్వహించారు. నిబంధనలు పాటించని ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేయవద్దని సూచించారు. ఆసుపత్రిలో జరిగే జనన, మరణ వివరాలను రెగ్యులర్‌గా సమర్పించాలని తెలిపారు.

error: Content is protected !!