News January 15, 2026

పెద్దపల్లి: సర్పంచ్‌లకు రెండు విడతల్లో శిక్షణ

image

పెద్దపల్లి జిల్లాలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లకు రెండు విడతలుగా ప్రభుత్వం శిక్షణ అందించనుంది. ఈనెల 19 నుంచి 23 వరకు మొదటి విడత, ఫిబ్రవరి 4 నుంచి 8 వరకు రెండో విడత తరగతులు నిర్వహిస్తారు. పెద్దపల్లి మండలంలోని మదర్ థెరిస్సా ఇంజినీరింగ్ కళాశాలలో సర్పంచ్‌లకు శిక్షణ అందించనున్నారు. మొదట విడతలో కమాన్‌పూర్, పెద్దపల్లి, సుల్తానాబాద్, ఓదెల, పాలకుర్తి, కాల్వ శ్రీరాంపూర్ సర్పంచ్‌లకు శిక్షణ ఇవ్వనున్నారు.

Similar News

News April 13, 2026

ఇరాన్ పోర్టులను దిగ్బంధిస్తాం: అమెరికా

image

అమెరికా, ఇరాన్ మధ్య మరోసారి ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి. ఇరాన్ పోర్టుల్లోకి వెళ్లే, వచ్చే అన్ని నౌకలను దిగ్బంధిస్తామని US సైన్యం ప్రకటించింది. ‘ఏప్రిల్ 13న 10AM(US టైం ప్రకారం)కు ఇది మొదలవుతుంది. ఇరాన్ పోర్టులు, దాని తీర ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహించే అన్ని దేశాల నౌకలకు వర్తిస్తుంది. ఇరానేతర ఓడరేవులకు వెళ్లే, హార్ముజ్ జలసంధి గుండా వచ్చే ఇతర నౌకలకు ఆటంకం కలిగించబోం’ అని ట్వీట్ చేసింది.

News April 13, 2026

VZM: గొర్రెల కాపరిని తాళ్లతో కట్టిపడేసిన దుండగులు

image

బొండపల్లి మండలం గొల్లలపేట‌కు చెందిన పీతల సత్యం(60) ఆదివారం గ్రామానికి సమీపంలోని చింతల చెరువు వద్ద గొర్రెలు కాస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు తాటినారతో కాళ్లు,చేతులు,మెడను కట్టి పొదల్లో పడేసినట్లు బాధితుడు వాపోయాడు. అటువైపుగా వెళ్తున్న వ్యక్తులు సాయంత్రం తుప్పల్లో పడి ఉన్న సత్యం‌ను గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించి గజపతినగరం ఆసుపత్రి‌కి తరలించారు.

News April 13, 2026

ఏలూరు: ఆ విషాద ఘటనకు నాలుగేళ్లు..!

image

ఏలూరు(D) అక్కిరెడ్డిగూడెం పోరస్ ల్యాబ్స్‌లో 2022 ఏప్రిల్ 13న సంభవించిన రియాక్టర్ పేలుడు తీరని విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు మృతి చెందగా, 12 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై APPCB, CPCB విచారణ చేపట్టాయి. భద్రతా ప్రమాణాల ఉల్లంఘనే ఈ ప్రమాదానికి కారణమని విచారణలో తేలింది. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది.