News February 25, 2025

పెద్దపల్లి: సింగరేణి కార్మికులకు 2 గంటలు పర్మిషన్

image

ఈ నెల 27న జరగనున్న తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు అర్హులైన సింగరేణి ఉద్యోగులకు విధుల్లో నుంచి 2 గంటలు మినహాయింపు ఇస్తూ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. రామగుండం, గోదావరిఖని, మంథని, రామగిరి, 8ఇంక్లైన్ కాలనీ ఏరియాల్లో అర్హులైన పట్టభద్రులు మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించారు.

Similar News

News February 25, 2025

వనపర్తి జిల్లా ఉష్ణోగ్రత వివరాలు

image

గడిచిన 24 గంటల్లో వనపర్తి జిల్లాలో అత్యధికంగా పెబ్బేర్‌లో 36.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పాన్గల్ 36.2, కేతేపల్లి 36.1, ఆత్మకూర్ 36.1, శ్రీరంగాపూర్ 36.0, కానాయిపల్లి 36.0, అమరచింత 35.9, వెలుగొండ 35.9, విలియంకొండ 35.8, మదనపూర్ 35.7, జానంపేట 35.7, వీపనగండ్ల 35.7, దగడ 35.6, రేమద్దుల 35.4, ఘన్పూర్ 35.3, వనపర్తి 35.0 డిగ్రీలుగా ఉష్ణోగ్రతల నమోదయ్యాయి.

News February 25, 2025

కరీంనగర్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో త్రిముఖ పోరు

image

ఉమ్మడి KNR, మెదక్, నిజామాబాద్, అదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొంది. కాంగ్రెస్ నుంచి ‘అల్ఫోర్స్’ అధినేత నరేందర్ రెడ్డి, బీజేపీ నుంచి చిన్నమైల్ అంజిరెడ్డి, బీఎస్పీ అభ్యర్థిగా ప్రసన్న హరికృష్ణ పోటీ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ముగ్గురి మధ్యనే పోటీ నెలకొంది. ఈరోజు సాయంత్రం 4 గంటలతో ప్రచారానికి తెర పడనుంది. ఈ నెల 27న ఎన్నికలు జరగనున్నాయి. వీరిలో ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి?

News February 25, 2025

కరీంనగర్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో త్రిముఖ పోరు

image

ఉమ్మడి KNR, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొంది. కాంగ్రెస్ నుంచి ‘అల్ఫోర్స్’ అధినేత నరేందర్ రెడ్డి, బీజేపీ నుంచి చిన్నమైల్ అంజిరెడ్డి, బీఎస్పీ అభ్యర్థిగా ప్రసన్న హరికృష్ణ పోటీ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ముగ్గురి మధ్యనే పోటీ నెలకొంది. ఈరోజు సాయంత్రం 4 గంటలతో ప్రచారానికి తెర పడనుంది. ఈ నెల 27న ఎన్నికలు జరగనున్నాయి. వీరిలో ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి?

error: Content is protected !!