News August 31, 2025

పెద్దపల్లి: సెప్టెంబర్ 2న ఫోటో స్టూడియోలు బంద్

image

ముడి సరుకుల ధరలు, నిర్వహణ వ్యయం అధికమవుతున్న నేపథ్యంలో కొత్త రేట్ల అమలుకు డిమాండ్‌ చేస్తూ సెప్టెంబర్ 2న పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఫోటో స్టూడియోలు బంద్‌కు పిలుపు ఇచ్చారు. ఫోటోగ్రాఫర్లు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొని తమ ఆర్థిక పరిస్థితుల బలోపేతానికి సహకరించాలని జిల్లా ఫోటో & వీడియోగ్రాఫర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు తెలిపారు.

Similar News

News September 3, 2025

వైసీపీ ఎమ్మెల్యేలకు ఇదే నా విజ్ఞప్తి: స్పీకర్

image

AP: చంద్రబాబుకు ధైర్యముంటే వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చి చూడాలన్న <<17591420>>సజ్జల<<>> కామెంట్లపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్పందించారు. ‘పులివెందుల ఎమ్మెల్యే జగన్ అసెంబ్లీకి సిద్ధమా అంటూ చంద్రబాబు ఛాలెంజ్ చేశారు. ప్రతిపక్ష హోదా కావాలని కొంతమంది మాట్లాడుతున్నారు. 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలకు నా విజ్ఞప్తి. సభకు రండి.. ప్రజా సమస్యలపై చర్చించండి. స్పీకర్‌గా ఎమ్మెల్యేలందరికీ సమాన అవకాశం కల్పిస్తా’ అని ట్వీట్ చేశారు.

News September 3, 2025

ADB: PWD మంత్రి రాకేశ్‌ సింగ్‌ను కలిసిన MP నగేశ్

image

మధ్యప్రదేశ్ ప్రభుత్వ ప్రజా పన్నుల శాఖ(PWD) మంత్రి రాకేశ్ సింగ్‌ను MP నగేశ్ భోపాల్ నగరంలో మంగళవారం రాత్రి మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ రాజకీయాలు, తాజా అంశాలపై చర్చించినట్లు వెల్లడించారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎంపీ నగేశ్ పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ నాయకులు, అధికారులు తదితరులున్నారు.

News September 3, 2025

APPLY: రూ.1,40,000 జీతంతో 248 పోస్టులు

image

నేషనల్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్(NHPC) 248 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. అసిస్టెంట్ రాజ్‌భాష ఆఫీసర్, JE, సీనియర్ అకౌంటెంట్, సూపర్‌వైజర్(IT), హిందీ ట్రాన్స్‌లేటర్ పోస్టులు ఉన్నాయి. వయసు 30 ఏళ్లకు మించకూడదు. పోస్టులను బట్టి డిగ్రీ/బీ.టెక్/సీఏ చదివి ఉండాలి. జీతం పోస్టులను బట్టి నెలకు రూ.27,000-రూ.1,40,000 వరకు ఉంటుంది. వచ్చే నెల 1లోగా nhpcindia సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.