News March 13, 2025
పెద్దపల్లి: సెలవు దినాల్లో కూడా పన్నులు చెల్లించవచ్చు: అదనపు కలెక్టర్

సెలవు దినాల్లో కూడా పన్నులు చెల్లించవచ్చని పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ అరుణశ్రీ అన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పన్నులు మార్చి 31వ తేదీలోపు చెల్లిస్తే రాయితీ ఉంటుందని అన్నారు. మీసేవా, అధికారులు, డిజిటల్ పేమెంట్ ద్వారా కూడా పన్నులు చెల్లించవచ్చన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Similar News
News March 13, 2025
అక్కడి మహిళలు 10 మందిని పెళ్లి చేసుకునే సంప్రదాయం: మంత్రి

ఉత్తర భారతంలో ఒక స్త్రీ 10మందిని వివాహం చేసుకునే సంప్రదాయం ఉందని తమిళనాడు మంత్రి మురుగన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అదే దక్షిణ భారతంలో అటువంటి కల్చర్ లేదన్నారు. జనాభా నియంత్రణ విధానాన్ని పక్కాగా అమలు చేయడంతో ఇక్కడి జనాభా తగ్గిందని, కానీ నార్త్ ఇండియాలో ఒకరు 10మందికి పైగా పిల్లల్ని కన్నారన్నారు. తమిళ సంస్కృతిని హేళన చేసేలా ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే వారి నాలుక చీరేస్తానని మంత్రి హెచ్చరించారు.
News March 13, 2025
మంత్రులతో ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు

రాష్ట్ర మంత్రులు వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాస్‌తో విజయనగరం ఉమ్మడి జిల్లా తెదేపా ఎమ్మెల్యేలు ఎస్ కోట ఎమ్మెల్యే లలిత కుమారి, బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన, కురుపాం ఎమ్మెల్యే జగదీశ్వరి, చీపురుపల్లి ఎమ్మెల్యే కళా వెంకట్రావు, విజయనగరం ఎమ్మెల్యే అతిధి గజపతిరాజు, పార్వతీపురం ఎమ్మెల్యే విజయ్ చంద్ర తదితరులు అసెంబ్లీ లాబీలో గురువారం కలుసుకున్నారు.
News March 13, 2025
సీఎం చంద్రబాబు పేరు సూర్యబాబు అవుతుందేమో: RRR

AP: అసెంబ్లీలో సీఎం చంద్రబాబుపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోలార్ విద్యుత్‌పై చర్చ సందర్భంగా ‘సూర్యశక్తిని ఒడిసిపడుతున్నందుకు సీఎం చంద్రబాబు పేరు ఇక సూర్యబాబుగా మారుతుందేమో’ అని అన్నారు. వెంటనే స్పందించిన సీఎం ‘మీరేదో నాకు కరెంట్ షాక్ ఇవ్వాలనుకుంటున్నారు’ అని నవ్వుతూ అన్నారు. దీంతో సభలోని మిగతా సభ్యులూ నవ్వారు.