News April 8, 2025

పెద్దపల్లి: సోలార్ విద్యుత్‌పై సమీక్ష నిర్వహించిన కలెక్టర్

image

పెద్దపల్లి జిల్లాలోని ప్రజలకు పీఎం సూర్య ఘర్ పథకంపై అవగాహన కల్పించాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. మంగళవారం సోలార్ విద్యుత్‌పై అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఈ పథకం క్రింద ప్రజలు స్వచ్ఛందంగా ఇంటిపై రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకుంటే ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుందన్నారు. కిలో వాట్‌కు రూ.30 వేలు, 2 కేడబ్ల్యూకు రూ.60 వేలు, 3 కేడబ్ల్యూకు రూ.78 వేల సబ్సిడీని ప్రభుత్వం అందిస్తుందన్నారు.

Similar News

News February 25, 2026

బాపట్ల: ఫుల్లుగా తాగి బీరు బాటిల్‌తో దాడి

image

విజయవాడలో మద్యం మత్తులో ఓ యువకుడు రెచ్చిపోయాడు. చీరాలకు చెందిన ప్రసాద్ అనే ఎలక్ట్రీషియన్ పనుల నిమిత్తం ఇక్కడ గదిని అద్దెకు ఉంటున్నాడు. మంగళవారం ఇంటి యజమాని బంధువైన షౌకత్ అలీ ఖాన్ అక్కడికి వచ్చి, మా మేనత్త ఇంట్లో నువ్వెందుకు ఉంటున్నావు అంటూ గొడవకు దిగాడు. మద్యం మత్తులో ఉన్న షౌకత్, ప్రసాద్‌పై బీరు సీసాతో దాడి చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు మాచవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News February 25, 2026

మార్కాపురం జిల్లా అభివృద్ధికి CM వరాలు కురిపిస్తారా..?

image

మార్కాపురం జిల్లా ఏర్పడిన తర్వాత మొదటిసారి CM చంద్రబాబు వస్తున్న నేపథ్యంలో భారీగా ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు జిల్లా ఏర్పాటుచేయగా వెలుగొండ ప్రాజెక్టు పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. అయితే సీఎం జిల్లా అభివృద్ధికి ఎలాంటి వరాలు కురిపిస్తారోనని నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

News February 25, 2026

BIG BREAKING: నాగర్‌కర్నూల్ ఘటన.. పోస్టుమార్టం రిపోర్ట్‌ ప్రకటన

image

నాగర్‌కర్నూల్ మండలం కుమ్మెర మల్లన్న జాతర ఘటనలో నేరస్థులైన ముగ్గురిపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. A1-ఉంద్యాల శ్రీనివాస్ రెడ్డి, A2-మధు రెడ్డి, A3-శ్రీకాంత్ రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. రెండు నెలల చిన్నారి మృతదేహం పోస్టుమార్టం రిపోర్ట్‌లో అంతర్గతంగా, బహిర్గతంగా ఎలాంటి గాయాలు లేవని నివేదిక వచ్చిందని, RFSL రిపోర్ట్ నివేదిక వచ్చిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు.