News March 7, 2025

పెద్దపల్లి: 20 ఏళ్ల నుంచి చోరీలు.. 36 కేసులు నమోదు

image

2005 నుంచి దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిపై పలు జిల్లాల్లో 36 కేసులు నమోదయ్యాయని ఏసీపీ గజ్జి కృష్ణ తెలిపారు. ఏసీపీ వివరాలిలా.. భూపాలపల్లి(D) మల్హర్‌రావు(M) రెడ్డిపల్లెకు చెందిన బోరిగం సంపత్ జల్సాలకు అలవాటు పడి చోరీలు చేస్తున్నాడు. ఇటీవల పెద్దపల్లి(D) కాల్వ శ్రీరాంపూర్(M) చిన్నరాతులపల్లిలో శాంతమ్మ ఇంట్లో బంగారం అపహరించగా, విచారణ జరిపి, అతని వద్ద నుంచి రూ.15.47 లక్షల సొత్తు స్వాధీనం చేసుకున్నారు.

Similar News

News January 8, 2026

బయ్యారం: భార్యను హత్య చేసిన కేసులో జీవిత ఖైదు

image

బయ్యారం పోలీస్ స్టేషన్ పరిధిలోని 2021లో నమోదైన హత్య కేసులో నేరస్తుడిని న్యాయస్థానం జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నరేశ్ అనే యువకుడు మద్యం మత్తులో భార్యను హింసిస్తుండగా, ఆమె తల్లి జయ్యారం ఇంటికి వెళ్లింది. ఆసుపత్రికి తీసుకువెళ్తానని జయ్యారం వెళ్లి బయ్యారం మండల పరిధిలో నామలపాడు గ్రామ శివారులో హత్య చేసినట్లు విచారణలో రుజువైనట్లు పోలీసులు వెల్లడించారు.

News January 8, 2026

‘నూతన సమీకృత కలెక్టర్ భవన నిర్మాణాలు పూర్తి చేయాలి’

image

నూతన సమీకృత కలెక్టరేట్ భవనాల నిర్మాణం పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. ఈ మేరకు జరిగిన పనులను స్వయంగా ఆయన గురువారం పరిశీలించారు. ఇంత వరకు పూర్తికాని నిర్మాణాల గురించి ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సుగుణాకర్‌ను అడిగి తెలుసుకున్నారు. అసంపూర్తి కట్టడాలను త్వరగా పూర్తి చేయాలని చెప్పారు.

News January 8, 2026

YCP అధికారంలోకి వస్తే రాజధాని మారుతుందా?

image

AP: రాజధాని అంశం రాష్ట్ర రాజకీయాల్లో కాక రేపుతోంది. అమరావతిపై <<18799615>>జగన్<<>> చేసిన తాజా వ్యాఖ్యల నేపథ్యంలో YCP అధికారంలోకి వస్తే రాజధాని మారుతుందనే చర్చ మొదలైంది. గతంలో తీసుకొచ్చిన 3 రాజధానుల ప్రతిపాదనను ఈసారి అమలు చేస్తారనే టాక్ విన్పిస్తోంది. మరోవైపు అమరావతికి చట్టబద్ధత తెస్తామని ప్రభుత్వం చెబుతోంది. కాగా ప్రభుత్వం మారితే APకి రాజధాని మారుతుందా?, శాశ్వత క్యాపిటల్ ఉండదా? అని ప్రజలు చర్చించుకుంటున్నారు.