News December 8, 2025

పెద్దపల్లి : 24 ఏళ్లకు మళ్లీ ఆ రిజర్వేషన్

image

స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఓదెల మండలం కొలనూర్ గ్రామ సర్పంచ్ స్థానం ఎస్సీ రిజర్వ్‌డ్ అయింది. 2001 తర్వాత గ్రామానికి ఈ రిజర్వేషన్ రావడంతో అభ్యర్థులు భారీ సంఖ్యలో బరిలో ఉన్నారు. పోటీలో ఉన్న చాలామంది మొదటిసారి సర్పంచ్ అభ్యర్థిత్వాన్ని పరీక్షించుకోనున్నారు. 24 ఏళ్ల తర్వాత రిజర్వేషన్ రావడం.. ఇప్పుడుపోతే మళ్లీ ఎప్పుడు రిజర్వేషన్ వస్తుందో అన్న ఆలోచనతో అభ్యర్థులు ఈసారి తీవ్రంగానే శ్రమిస్తున్నారు.

Similar News

News December 10, 2025

పవన్‌కు నీతి, ధర్మం లేవు: అంబటి

image

AP: పరకామణి చోరీ విషయంలో జగన్ వ్యాఖ్యలను పవన్ వక్రీకరిస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. అసలు పవన్ ఏ ధర్మాన్ని పాటిస్తున్నారని ప్రశ్నించారు. ‘నేను బాప్టిస్ట్ మతం తీసుకున్నానని ఒకసారి, సర్వమతాలూ సమానమని మరోసారి అన్నాడు. ఇప్పుడు సనాతనమే తన ధర్మం అంటున్నాడు. నీకో ధర్మం లేదు, నీతి లేదు, మతం లేదు, సిద్ధాంతం లేదు. నీకున్న ఒకే ఒక్క సిద్ధాంతం CBN చెప్పింది చేయడం’ అని సెటైర్లు వేశారు.

News December 10, 2025

సిరిసిల్ల: ఈనెల 15 నుంచి 20 వరకు సదరం క్యాంపులు

image

సదరం క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని సిరిసిల్ల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపర్డెంట్ ప్రవీణ్ అన్నారు. ఈ మేరకు సిరిసిల్లలో బుధవారం ప్రకటన విడుదల చేశారు. ఈనెల 15 నుంచి 20 తేది వరకు సిరిసిల్లలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సదరం క్యాంపులను నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ క్యాంపులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

News December 10, 2025

GNT: సీఐపై నిందారోపణ కేసులో ట్విస్ట్

image

సీఐ తనపై దాడి చేయించారంటూ నిందలు మోపిన జర్నలిస్ట్ కన్నెగంటి అరుణ్ బాబు సహా మరో ఇద్దరిని పట్టాభిపురం పోలీసులు అరెస్ట్ చేశారు. రౌడీలను పెట్టుకుని తన కారును తానే ధ్వంసం చేయించి, పోలీసులపై అబద్ధపు ఫిర్యాదు చేసినట్లు విచారణలో తేలింది. విజయవాడ బస్టాండ్ వద్ద అరుణ్ బాబు, పొంగులూరి అన్వేష్, కారుకుట్ల సుధీర్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. మీడియా ముసుగులో బెదిరింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు.