News March 13, 2025

పెద్దపల్లి: 3 నెలలకు ఒకసారి ఓటర్ జాబితా సవరణ జరగాలి: సీఈఓ

image

తెలంగాణ ఎన్నికల ముఖ్య అధికారి సుదర్శన్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, RDO గంగయ్య జిల్లా అధికారులతో కలిసి పాల్గొన్నారు. మార్చి 19 లోపు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. ప్రతి 3 నెలలకు ఒకసారి ఓటర్ జాబితా సవరణ పకడ్బందీగా జరగాలన్నారు.

Similar News

News September 16, 2025

రేవంత్.. ఇంతకన్నా చేతకానితనం ఉంటుందా: కేటీఆర్

image

TG: సీఎం రేవంత్, కాంగ్రెస్ సర్కారు ఘోరతప్పిదంతో SLBC టన్నెల్ కూలిందని, ఈ ఘటనలో ఆరుగురి మృతదేహాలను బయటకు తీయలేక చేతులెత్తేశారని KTR మండిపడ్డారు. ‘హైదరాబాద్ నాలాలో కొట్టుకుపోయిన ముగ్గురి డెడ్ బాడీలను మూడు రోజులైనా గుర్తించలేరా? ఇంతకన్నా చేతకానితనం, పరిపాలనా వైఫల్యం ఇంకోటి ఉంటుందా? తమ ఆప్తులను చివరి చూపు చూసుకోలేని బాధిత కుటుంబాల ఆవేదన ప్రభుత్వానికి వినిపించడం లేదా?’ అని ప్రశ్నలు సంధించారు.

News September 16, 2025

నారాయణరావుపేట అత్యధిక వర్షపాతం

image

సిద్దిపేట జిల్లాలో భారీ వర్షం కురిసింది. అత్యధికంగా నారాయణరావుపేట మండలంలో 24.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మిరుదొడ్డి మండలంలో 87 మి.మీ, బేగంపేటలో 86 మి.మీ, రాంపూర్‌లో 82.8 మి.మీ వర్షపాతం నమోదైంది. జిల్లా సగటు వర్షపాతం 38.3 మిల్లీమీటర్లుగా ఉంది.

News September 16, 2025

పాలకొల్లు: స్కూలు బస్సు ఢీకొన్న ఘటనలో వ్యక్తి మృతి

image

పాలకొల్లులో సోమవారం బస్సు ఢీకొని తీవ్రంగా గాయపడిన పోడూరు మండలం పెనుమదం గ్రామానికి చెందిన ఏలూరి శ్రీను మృతి చెందాడు. శ్రీను తలకు తీవ్ర గాయం కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. కొబ్బరి వలుపు పని నిమిత్తం శ్రీను పాలకొల్లుకు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు ఎస్సై సుధాకర్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.