News March 16, 2025
పెద్దపల్లి: 30న అఖిల భారత యాదవ మహాసభ

ఈనెల 30వ తేదీన అఖిల భారత యాదవ మహాసభ నిర్వహించనున్నట్లు యాదవ సంఘం నాయకులు శనివారం వెల్లడించారు. ఈ మేరకు పెద్దపల్లి పట్టణంలో మీడియాతో మాట్లాడారు. మహాసభలో యాదవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాలు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. పురస్కారాల కోసం ఆసక్తి ఉన్నవారు ఈనెల 23వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని, అలాగే మహాసభను విజయవంతం చేయాలని కోరారు.
Similar News
News March 16, 2025
రేపు క్యాబినెట్ భేటీ

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు మంత్రివర్గ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో ఈ భేటీ ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టే పలు బిల్లులకు క్యాబినెట్ ఆమోదం పలకనున్నట్లు తెలుస్తోంది. అలాగే రాజధాని అమరావతిలో సీఆర్డీఏ చేపట్టనున్న 22 పనులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని సమాచారం. ఇంకా పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది.
News March 16, 2025
సీఎంను మర్యాదపూర్వకంగా కలిసిన వరంగల్ సీపీ

జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం శివునిపల్లి శివారు ప్రాంతంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొనేందుకు హెలికాప్టర్‌లో సభాస్థలికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డిని వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పాగుచ్ఛాన్ని సీఎంకు సీపీ అందజేశారు. అనంతరం పోలీస్ కమిషనర్ ముఖ్యమంత్రితో సభాస్థలికి చేరుకున్నారు.
News March 16, 2025
విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చేప్పిన పల్నాడు కలెక్టర్

జిల్లాలోని పదవ తరగతి విద్యార్థులందరూ ఆందోళన లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, ఎస్పీ శ్రీనివాసరావు కోరారు. జిల్లాలో 463 పాఠశాల నుంచి మొత్తం 26,497 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. జిల్లాలో 128 పరీక్ష కేంద్రాలలో బాలురు 13,415 మంది బాలికలు 1,382 మంది ఉన్నారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలన్నారు. జిల్లాలోని విద్యార్థులందరికీ ఆల్ ది బెస్ట్ తెలియజేశారు.