News December 1, 2025

పెద్దపల్లి: 35 కంప్యూటర్ల సరఫరాకు దరఖాస్తుల ఆహ్వానం

image

పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ పాఠశాలలకు 35 కంప్యూటర్ల సరఫరా కోసం ఆసక్తి గల సరఫరాదారులు డిసెంబర్ 4లోగా దరఖాస్తులు సమర్పించాలని ఇన్చార్జ్ డీఈఓ శారద తెలిపారు. దరఖాస్తులు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో స్వీకరించబడతాయి. వివరాలకు సెక్టోరల్ అధికారి సి.హెచ్. మల్లేష్ గౌడ్‌ (ఫోన్: 9959262737) ను సంప్రదించవచ్చు.

Similar News

News December 1, 2025

ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన అదనపు కలెక్టర్ శ్రీజ

image

ఫేజ్-2 మండలాల స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లను అదనపు కలెక్టర్ శ్రీజ ఈరోజు పరిశీలించారు. నామినేషన్ కేంద్రాలలో అన్ని విధానాలు జాగ్రత్తగా అమలవుతున్నాయని ఆమె నిర్ధారించుకున్నారు. అనంతరం డీపీఓ కార్యాలయాన్ని తనిఖీ చేసి, రోజువారీ రిపోర్టింగ్ ప్రక్రియలను ధృవీకరించారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా చూడాలని ఆమె అధికారులను ఆదేశించారు.

News December 1, 2025

హనుమకొండ: నర్సింగ్ విద్యార్థినిపై కెమికల్ దాడి

image

హనుమకొండలోని ఓ నర్సింగ్ కాలేజీలో బీఎస్సీ నర్సింగ్ చదువుతున్న ఓ యువతి మీద కాజీపేట కడిపికొండ బ్రిడ్జిపై గుర్తుతెలియని వ్యక్తులు కెమికల్ దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన ఆమెను వెంటనే ఎంజీఎం ఆస్పత్రిలో చేర్చగా, వైద్యులు చికిత్స అందిస్తున్నారు. బాధితురాలిది జనగాం జిల్లా జఫర్‌ఘడ్ మండలం అని తెలిసింది. కాజీపేట ఏసీపీ, పోలీసులు ఎంజీఎం ఆస్పత్రిలో బాధితురాలితో మాట్లాడి విచారణ చేస్తున్నారు.

News December 1, 2025

దిగ్గజ టెన్నిస్ ప్లేయర్ కన్నుమూత

image

ఇటలీకి చెందిన దిగ్గజ టెన్నిస్ ప్లేయర్, రెండుసార్లు ఫ్రెంచ్ ఓపెన్ విజేత నికోలా పియట్రాంగెలీ(92) కన్నుమూశారు. ఈ విషయాన్ని ఇటలీ టెన్నిస్ ఫెడరేషన్ ధ్రువీకరించింది. ప్రపంచ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో ఇటలీ నుంచి చోటు దక్కించుకున్న ఏకైక ప్లేయర్ నికోలానే కావడం విశేషం. తన కెరీర్‌లో 44 సింగిల్స్ టైటిళ్లను గెలుచుకున్నారు. ఆయన తండ్రి ఇటలీకి చెందిన వ్యక్తి కాగా తల్లి రష్యన్. నికోలా 1933లో జన్మించారు.