News February 26, 2026
పెద్దపల్లి: 74 మంది విద్యార్థుల గైర్హాజరు

జిల్లా వ్యాప్తంగా గురువారం జరిగిన ఇంటర్ రెండో సంవత్సరం తెలుగు/ఉర్దూ/ హిందీ /సంస్కృతం పరీక్షకు 98% విద్యార్థులు హాజరయ్యారని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కల్పన తెలిపారు. 4815 మంది విద్యార్థులు హాజరు కావలసి ఉండగా 4731 మంది హాజరయ్యారని పేర్కొన్నారు. 74 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు వెల్లడించారు. మొత్తం మీద పరీక్ష ప్రశాంతంగా జరిగినట్లు ఒక ప్రకటనలో తెలిపారు.
Similar News
News February 27, 2026
HYD: మామూళ్ల మోజులో అధికారులు.. మెమోలు..!

శివారు కాలనీల్లో నీటికోసం జనం తపిస్తుంటే అధికారులు మాత్రం ట్యాంకర్ మాఫియాతో చేతులు కలిపారు. కావాలనే పైపులైన్లలో ప్రెజర్ తగ్గించి ప్రైవేట్ ట్యాంకర్లకు కొమ్ము కాస్తున్నారు. ప్రభుత్వ ఫిల్లింగ్ పాయింట్ల వద్దే తక్కువ ధరకు నీటిని నింపుకొని బయట రూ.2000 వరకు అమ్ముతూ సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతున్నారు. ఈ దందాలో కిందిస్థాయి నుంచి పైదాకా వాటాలు వెళ్తున్నాయని తేలడంతో కొందరు అధికారులకు మెమోలు జారీ అయ్యాయి.
News February 27, 2026
చెప్పినట్టే కడిగిన ముత్యంలా బయటికొచ్చా: కవిత

TG: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో క్లీన్‌చిట్ లభించడంపై కవిత హర్షం వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థపై పెట్టుకున్న నమ్మకం నిలబడిందన్నారు. ఈ కేసు కేవలం రాజకీయ కుట్రలో భాగంగానే మోపారని తాను తెలంగాణ ప్రజలకు మొదటి నుంచీ చెప్తూ వస్తున్నట్లు తెలిపారు. ‘కడిగిన ముత్యంలా వస్తానని ముందే చెప్పాను. అదే జరిగింది. కష్టసమయంలో అండగా నిలబడ్డ జాగృతి కార్యకర్తలు, భర్త, అత్తామామలు, కొడుకులకు ధన్యవాదాలు’ అని అన్నారు.